త్వరలో ఉదయిస్తూ వీరికి సంపదల ఖజానా ఖరారు చేసిన బుధుడు!

వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడికి కూడా చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. బుధుడు వల్ల ఈ వారంలో మూడు రాశుల వారికి మంచి సమయం ప్రారంభమవుతుంది. సమాజంలో గౌరవానికి, ఆర్థిక ప్రయోజనాలకు బుధుడు ఈ వారం కొన్ని రాశుల వారికి కారణంగా మారుతున్నాడు.

కుంభరాశిలో బుధ ఉదయం
ఫిబ్రవరి 22వ తేదీన సాయంత్రం ఏడు గంటల 4 నిమిషాలకు కుంభరాశిలో బుధుడు ఉదయించనున్నాడు. మార్చి 18వ తేదీ వరకు కుంభరాశిలో బుధుడు ఈ స్థితిలో ఉంటాడు. ఈ సమయంలో మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

Mercury rise in aquarius on february 22nd has giving wealth for these zodiac signs

మేషరాశి
బుధుడు ఉదయం కారణంగా మేష రాశి వారికి శుభ సమయం ప్రారంభమవుతుంది. మేషరాశి జాతకులు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. చాలా విషయాల్లో మేష రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది.

సింహరాశి
సింహరాశి వారికి బుధుడి ఉదయం కారణంగా కలిసి వస్తుంది. సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. తోబుట్టువులు, బంధువుల నుంచి సింహ రాశి వారికి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా జీవిస్తారు. ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి సానుకూల ఫలితం ఉంటుంది.

వృశ్చిక రాశి
కుంభరాశిలో బుధుడు ఉదయించడం కారణంగా వృశ్చిక రాశి వారికి శుభాలు జరుగుతాయి. ఈ సమయంలో వీరికి ధన ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆస్తులు కొనాలనుకునే వారికి ఈ సమయం సానుకూల సమయం. వర్తక, వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాలలో ప్రశంసలు దక్కుతాయి. ఇది కుంభరాశి వారికి అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+