Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!

జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివిధ అంశాల ద్వారా ప్రతిరోజు వ్యక్తికి ఆర్థిక లావాదేవీలు ఎలా ఉంటాయో అంచనా వేస్తుంటారు. గ్రహాలు నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేస్తారు. ఇక ఈరోజు మార్చి 29వ తేదీ అన్ని రాశుల వారి ధన జ్యోతిష్యం ఎలా ఉందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష, వృషభ రాశులు
ఈరోజు మేష రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. డబ్బు ప్రవాహాన్ని నిర్దేశించడం లో మీరు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. వృషభరాశి వారికి డబ్బు ఖర్చు చేసే దృక్పథంలో పెద్ద మార్పు ఈరోజు కనిపిస్తుంది. రోజువారి వ్యవహారాలకు డబ్బు ఖర్చు చేసే విషయంలో నేడు మీరు మరింత జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తారు.

Money astrology March 29th Dhanalakshmi blessings for these zodiac signs

మిధున, కర్కాటక రాశులు
మిధునరాశి జాతకులకు నేడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్లయితే, మంచి ధరకు వాటిని అమ్ముకునే అవకాశం ఉంటుంది. మంచి పని చేస్తే మిధునరాశి జాతకులకు ఎల్లప్పుడు ఆ మంచికి తగిన ప్రతిఫలం తప్పకుండా వచ్చి తీరుతుంది. కర్కాటక రాశి ఈరోజు మీకు నక్షత్రాలు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థికంగా సంతోషంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు ఫలవంతంగా కనిపిస్తుంది. మీరు చేయాలనే ప్రతి పనికి నక్షత్రాల అనుకూలత సహకరిస్తుంది.

సింహ, కన్యా రాశులు
సింహరాశి జాతకులు ఈరోజు ఆర్థిక విషయాలపై కొంత తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం. మీ నిధులను ఎలా ఉపయోగించాలి అన్న దానిపైన సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం చేసే స్వల్ప దూర ప్రయాణాలు మీకు లాభాలను ఇస్తాయి. కన్యారాశి వారికి ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు బాగా డబ్బు సంపాదించాలని విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే మీరు విజయం సాధించే అవకాశం ఉంది.

తులా, వృశ్చిక రాశులు
తులారాశి జాతకులు ఆలోచనలకు తగ్గట్టుగా డబ్బులను ఖర్చు చేస్తారు. మీ డబ్బు ఖర్చు చేసే విధానం పై అవతలి వారు భిన్నంగా చూసినప్పటికీ మీరు ఖర్చు పెట్టే డబ్బులు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. వృశ్చిక రాశి జాతకులు ఈరోజు మీ పనుల విషయంలో కాస్త విసుగు చెందే అవకాశం ఉంది. డబ్బుల లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు, మకర రాశులు
ధనుస్సు రాశి జాతకులు నేడు పరిస్థితిని గురించి మార్కెట్లోని వ్యక్తులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని సలహా. ఈరోజు మీకు వారసత్వంగా కొంత ఆస్తి వచ్చే అవకాశం ఉంది. మకర రాశి జాతకులు వర్తక వ్యాపారాలు చేసే వారికి కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం.

కుంభ, మీనరాశులు
కుంభ రాశి జాతకులకు ఈరోజు అదృష్ట అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా లాభదాయకంగానే ఉంటుంది. మీరు ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు లాభాలను ఇస్తాయి. మీన రాశి జాతకులు ఈరోజు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి. మీ డబ్బు సకాలంలో తిరిగి రాకపోవచ్చు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+