Monthly horoscope: 2026 జనవరి నెలలో ఈ రాశులవారికి సంపదల సునామీ!
కొత్త ఆశలతో కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యింది. ఈ సంవత్సరం అంతా అందరూ మంచే జరగాలని భావిస్తారు. జనవరి 2026 నెలలో గ్రహాల సంచారం అనేక రాశులకు అనుకూలంగా, కొన్ని రాశులకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తోంది. ఉద్యోగాలు, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ జీవితం, ఆరోగ్యం అంశాలపై 12 రాశుల వారికి ఈ నెల ఎలా ఉండబోతోందో సంక్షిప్తంగా తెలుసుకుందాం.
మేషం
జనవరి నెలలో మేషరాశి జాతకులకు ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థికంగా లాభాలు ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిడిని నియంత్రించుకోవాలి.

వృషభం
జనవరి నెల వ్యాపారాల్లో స్థిర లాభాలు వస్తాయి . సేవింగ్స్ పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్య సూచనలు ఉన్నాయి.
మిథునం
జనవరి నెలలో మిధున రాశి వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. విదేశీ ప్రయాణ యోగం ఉంది . నిద్రలేమి సమస్యలు రావచ్చు.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
సింహం
సింహరాశి వారి నాయకత్వ లక్షణాలు ఈ నెలలో వెలుగులోకి వస్తాయి. పెట్టుబడులకు అనుకూల సమయం. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య
కన్యా రాశి జాతకులకు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఖర్చులు పెరిగినా నియంత్రణ సాధ్యమే. వెన్నునొప్పి వచ్చే అవకాశం జాగ్రత్త.
తుల
తులారాశి వారికి జనవరి నెలలో భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకులకు ఉద్యోగ మార్పు అవకాశాలు ఉన్నాయి. ధనలాభం సూచన ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మకరం
మకర రాశి వారికి శ్రమ ఎక్కువైనా ఫలితం ఉంటుంది. మకర రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు ఉంటాయి.
కుంభం
జనవరి నెలలో కుంభరాశి వారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఈ నెలలో మీకు అలసట ఎక్కువగా ఉంటుంది.
మీనం
జనవరి నెల సృజనాత్మక రంగాల్లో వారికి అనుకూల కాలం. ఈ నెలలో ఖర్చులు పెరిగినా లాభాలు ఉంటాయి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications