Moral story:ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయా..ఈ కథ చదవండి..!!

మనసులో మెదిలే ఆలోచనలు మన ప్రవర్తనను మాత్రమే కాదు..మన జీవిత గమనాన్ని కూడా ప్రభావితం చేస్తాయని పెద్దలు చెబుతుంటారు.ఎదుటివారి పట్ల మనకు ఉండే భావాలు మన మాటల్లో,చేతల్లో కనిపిస్తాయి.కొన్నిసార్లు మనం బయటకు చెప్పని ఆలోచనలు కూడా మన ప్రవర్తనలో ప్రతిబింబిస్తాయి.మంచి మనసుతో ఉంటే మంచి ఫలితాలు,చెడు ఆలోచనలతో ఉంటే ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని చెప్పే ఓ ఆసక్తికరమైన కథ ఇది.

వ్యాపారిపై రాజుకు ఎందుకు కోపం వచ్చింది?

ఒకప్పుడు ఓ రాజు తన రాజ్యంలో ప్రజల పరిస్థితులను తెలుసుకునేందుకు ఏనుగుపై పర్యటించేవాడు.అలా వెళ్తుండగా ఓ గంధపు చెక్కల దుకాణం ముందు ఆగాడు.అక్కడున్న వ్యాపారిని చూడగానే రాజుకు అకారణంగా కోపం వచ్చింది.అతడిని ఉరితీయాలనే ఆలోచన కూడా కలిగింది.ఈ విషయాన్ని తన మంత్రితో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.రాజుకు ఆ వ్యాపారిపై ఎందుకు అంత కోపం వచ్చిందో మంత్రికి అర్థం కాలేదు.అసలు విషయం తెలుసుకోవాలని మరుసటి రోజు సామాన్యుడి వేషంలో ఆ దుకాణానికి వెళ్లాడు.వ్యాపారంతో పాటు అతడి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నాడు.

moral-story-can-your-thoughts-change-your-destiny-this-king-and-merchant-story-reveals-a-powerful-t

వ్యాపారి మనసులోని దురాశ

తన వద్దకు చాలామంది వచ్చి గంధపు చెక్కల నాణ్యతను మెచ్చుకుంటున్నారని,కానీ ఎవరూ కొనడం లేదని వ్యాపారి బాధపడ్డాడు.రాజు మరణిస్తే అంత్యక్రియలకు పెద్ద మొత్తంలో గంధపు చెక్కలు అవసరమవుతాయని,అప్పుడు తన సరుకంతా అమ్ముడుపోయి పేదరికం తొలగిపోతుందని ఆశపడుతున్నట్లు చెప్పాడు.వ్యాపారి మనసులోని ఈ దురాశను తెలుసుకున్న మంత్రి ఒక ఉపాయం ఆలోచించాడు.అతడి వద్ద కొంత గంధపు చెక్కలు కొనుగోలు చేసి రాజసభకు వెళ్లాడు.అవి వ్యాపారి రాజుకు కానుకగా పంపించాడని చెప్పి సమర్పించాడు.

జింక తెలివికి పులి బేజారు -ఒక్క మాటతో కథనే మార్చేసిన సమయస్ఫూర్తి..!!
జింక తెలివికి పులి బేజారు -ఒక్క మాటతో కథనే మార్చేసిన సమయస్ఫూర్తి..!!

మారిన వ్యాపారి ఆలోచనలు

గంధపు చెక్కల సువాసనకు రాజు ఎంతో సంతోషించాడు.వ్యాపారికి బంగారు నాణేలను బహుమతిగా పంపించాడు.ఆ కానుక అందుకున్న వ్యాపారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.తనకు మేలు చేసిన రాజు దీర్ఘకాలం జీవించాలని కోరుకున్నాడు.గతంలో రాజు మరణాన్ని కోరుకున్న తన ఆలోచనలను తలుచుకుని పశ్చాత్తాపపడ్డాడు.

యమలోకంలో వేటగాడికి షాక్ - తలరాతను మార్చేసిన ఓ చిన్న పిట్ట..!!
యమలోకంలో వేటగాడికి షాక్ - తలరాతను మార్చేసిన ఓ చిన్న పిట్ట..!!

ఈ కథలోని నీతి: ఇతరుల పట్ల ద్వేషం,స్వార్థం పెంచుకుంటే మన మనసుకే ప్రశాంతత ఉండదు.అదే ప్రేమ,దయ,సద్భావనతో ఆలోచిస్తే మన ప్రవర్తన మారుతుంది..మన చుట్టూ ఉన్న సంబంధాలూ మెరుగుపడతాయి.కాబట్టి ఎదుటివారికి మంచి జరగాలని కోరుకుందాం.ఎందుకంటే మన ఆలోచనల్లోని మంచితనమే మన జీవితానికి నిజమైన అందం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+