2024లో రాహువు ప్రతికూల ప్రభావం: మూడు రాశులవారికి కష్టకాలం!!
జ్యోతిష్య శాస్త్రంలో రాహు గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సహజంగా రాహు గ్రహాన్ని నీడ గ్రహం గాను, ప్రతికూల ఫలితాలను ఇచ్చే గ్రహంగాను చెబుతారు. అయితే అది కరెక్ట్ కాదు. రాహు గ్రహం ప్రజల జీవితాలలో శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. అయితే రాహువు దుష్ప్రభావాలను కలిగిస్తే అవి చాలా తీవ్రంగా ఉంటాయి అనేది మాత్రం వాస్తవం.
2024 సంవత్సరంలో వివిధ సమయాలలో జాతకంలో చెడు స్థానాలలో రాహువు ఉండటం వల్ల ప్రతికూల ఫలితాలను పొందే రాశుల వారి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. 2024లో రాహువు కారణంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే మొదటి రాశి కన్యారాశి. ఈ సంవత్సరం కన్యారాశి జాతకులు రాహువు కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

కన్యా రాశిలో రాహువు ఏడవ ఇంట్లో సంచరించడం వల్ల స్నేహితులు, బంధువుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాహువు అడుగడుగునా మీ పనులకు ఆటంకాలు కూడా కలిగిస్తాడు. కన్యా రాశి వారి కుటుంబ జీవనంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వాముల మధ్య అవగాహన లోపంతో ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్త వహించాలి.
రాహువు కారణంగా 2024లో ఇబ్బంది పడే మరో రాశి ధనుస్సు రాశి. రాహువు కారణంగా ధనుస్సు రాశి జాతకుల జీవితాలలో అనేక ఇబ్బందులు వస్తాయి. వారి జీవితంలో సుఖానికి, సౌకర్యానికి కొరత ఏర్పడుతుంది. ధనుస్సు రాశిలో రాహువు నాలుగవ ఇంట్లో సంచారం చేయడం వల్ల, ఇది ఆ రాశి జాతకులు జీవితాల పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
ముఖ్యంగా వారి ఆరోగ్యం పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ధనుస్సు రాశి జాతకులు తమ అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాహువు ధనుస్సు రాశి జాతకులు ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావం చేస్తాడు. కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఆస్తికి సంబంధించిన పెద్ద వివాదాన్ని ధనుస్సు రాశి జాతకులు ఎదుర్కోవలసి వస్తుంది.
2024 సంవత్సరంలో రాహువు కారణంగా కుంభరాశి జాతకుల జీవితాలలో అనేక సమస్యలు వస్తాయి. ఈ కాలంలో ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. ఇది కుంభ రాశి జాతకులకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో చేసిన ప్రయాణాలు కూడా అశుభ ఫలితాలను ఇస్తాయి.
ఈ కారణంగా ప్రయాణాలు విషయంలో కూడా కుంభరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. 2024లో రాహువు యొక్క ప్రతికూల ప్రభావం మీ ఆరోగ్యం పై చెడు ప్రభావాలను చూపుతుంది. కాబట్టి ఆరోగ్యం పైన జాగ్రత్తలు తీసుకోవడం కుంభరాశి వారికి సూచించబడింది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications