Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రథసప్తమి నేడే: ఆరోగ్యం వరంగా ఇచ్చే సూర్య భగవానుడు.. ఇలా చెయ్యండి!!

సూర్య భగవానుడు.. సూర్యుడు దయ లేని మానవ జీవితం మృగ్యంగా మారుతుంది. ప్రతిరోజు సూర్యకిరణాలు మనపై పడితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, సంతోషంగా జీవించాలంటే సూర్యుడి కృపా వీక్షణాలు మనపై ఎప్పుడూ ప్రసరించాలి.

ఇక నేడు సూర్య జయంతి.. అంటే సూర్యుడి పుట్టిన రోజు. ఈరోజునే సూర్యుడు ఏడు గుర్రాలపై ప్రయాణం చేస్తూ ప్రపంచమంతా తన కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరింప చేసే శుభదినం. అందుకే ఈరోజును రథసప్తమిగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం రథసప్తమి చాలా ప్రశస్తమైనది. ముఖ్యంగా రథసప్తమి రోజున సూర్యభగవానుడి దయ కోసం సూర్యుడిని నిష్టగా పూజించాలి.

On Ratha saptami, Do this for Lord Surya gives the gift of health

సూర్య భగవానుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే రోగ పీడల నుండి విముక్తి దొరుకుతుందని చెబుతున్నారు. ప్రస్తుత సమాజంలో వందమందిలో 80 మంది రోగ పీడితులే. ఆరోగ్యం కోసం ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్న వారే.. ఇక అలాంటివారు రథసప్తమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి నదీ స్నానం ఆచరించి, సూర్యుడికి అర్ఘ్య పార్ఘ్యాలను సమర్పించి, సూర్యునికి ఇష్టమైన ప్రసాదాలను నివేదన చేస్తే సూర్యుడి దయ వారిపై తప్పకుండా ఉంటుంది.

తప్పకుండా వారు అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారన్నది చాలామంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేడు మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిథి. రథసప్తమిగా ఈరోజు అందరూ విశేషంగా సూర్యభగవానుడిని పూజిస్తారు. సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఇంట్లో సూర్య యంత్రాన్ని స్థాపించి, సూర్య నామ జపం చేస్తే ఆయన ప్రసన్నం అవుతారు. ఈ రోజు ఉపవాసం చేసినా, దాన ధర్మాలు చేసినా మెరుగైన ఫలితాలే వస్తాయి.

ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు సూర్యుడు కాబట్టి సూర్య జయంతిని ఆరోగ్య సప్తమిగా కూడా పిలుస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్... అని కూడా చెబుతుంటారు. అంటే ఆరోగ్యం కలగాలంటే సూర్యుడి వల్లనే అది లభ్యమౌతుంది. కాబట్టి రోగాలతో బాధ పడేవారు ఈ రోజు రథసప్తమి సందర్భంగా సూర్యుడిని నిష్టగా పూజించి ఆరోగ్యాన్ని వరంగా పొందండి. కనీసం సూర్య నమస్కారం అయినా చేయండి.

రథసప్తమి నాడు సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు స్నాన, పూజ, దాన, ఉపవాసములను చెయ్యండి. ఆరోగ్యం, అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. నీళ్లలో ఎర్రచందనాన్ని, బెల్లాన్ని ఎర్రటి పువ్వులను వేసి, సూర్యుడికి సమర్పిస్తే ఆదిత్య హృదయాన్ని పఠిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+