పరమ దరిద్రంగా పాకిస్తాన్ జాతకం.. అష్ట దిగ్బంధనం!

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతదేశం ఉగ్ర మూకను అణిచివేయడానికి ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోను, పాకిస్తాన్లోను ఉన్న ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. పహల్గామ్ లో పర్యాటకుల పైన ఉగ్ర మూక దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్న ఘటనకు ప్రతీకారంగా భారత్ ఈ చర్యకు పాల్పడింది.

పాకిస్తాన్ జాతకంపై చర్చ
భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టడంతో, ప్రతిదాడులు మొదలుపెట్టిన పాకిస్తాన్ ఆది నుంచి అన్నింటిలోనూ విఫలమవుతూనే ఉంది. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ జాతకం పైన సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ దేశం 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రత్యేక దేశంగా ఏర్పాటయింది. పాకిస్తాన్ వ్యవస్థాపక సంవత్సరం, తిథి, నక్షత్రాలు, కాలమానం ప్రకారం పాకిస్తాన్ జాతకం మేష లగ్నానికి చెందినదని చెబుతున్నారు.

Pakistan horoscope is extremely worst this is what heappens in war

Take a Poll

దరిద్రంగా పాకిస్తాన్ జాతకం
మేష లగ్నానికి అధిపతి కుజుడు ప్రస్తుతం బలహీనపడి కర్కాటక రాశిలో ఉన్నాడని, కుజుడు నీచరాశి లో ఉంటే ఎందులోనైనా ఓటమి తప్పదని తెలుస్తుంది. ఏ రకంగా చూసినా పాకిస్తాన్ జాతకం పరమ దరిద్రంగా ఉందని కొందరు జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కర్కాటక రాశిలో బలహీనంగా ఉన్న కుజుడు జూన్ 7వ తేదీ వరకు పాకిస్తాన్ కు చుక్కలు చూపించబోతున్నాడు అని చెబుతున్నారు.

పాకిస్తాన్ కు సైనిక ఘర్షణ తో జరిగేదిదే
భారత్ తో పెట్టుకున్న పాకిస్తాన్ యుద్ధంలో గెలవడం కష్టమేనని ఖగోళ పరిణామాలు కూడా చెబుతున్నాయని పేర్కొంటున్నారు. పాక్ దేశవ్యవస్థాపక జాతకంలో మూడవ గృహానికి అధిపతిగా ఉన్న బుధుడు, నాలుగవ గృహానికి అధిపతి అయిన చంద్రుడితో కలిసి ఒక ప్రమాదకరమైన సంయోగం చేయడం వల్ల పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని, సైనిక ఘర్షణ పాకిస్తాన్ కు నష్టాన్ని చేకూరుస్తుందని చెబుతున్నారు.

పాకిస్తాన్ జాతకం ప్రకారం ముప్పేట దాడి
ప్రస్తుతం మూడవ, ఆరవ అధిపతి బుధుడి అంతర్దశ, మరకశి శుక్ర మహాదశలో జరుగుతున్న క్రమంలో పాకిస్తాన్ సైన్యానికి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ జాతకం ప్రకారం ముప్పేట దాడి జరగబోతుందని అంటున్నారు. ఒకవైపు భారత్ సరిహద్దులలో సైనికపరమైన ఒత్తిడి, మరోవైపు తాలిబన్లు, ఇంకొకవైపు బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల దాడులు పాకిస్తాన్ కు దురదృష్టాన్ని, భారీ నష్టాలను తెచ్చి, అన్ని విధాలుగా పాకిస్తాన్ నాశనానికి కారణం అవుతాయని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+