పెదవుల ఆకృతిని బట్టి వ్యక్తిత్వం.. కచ్చితంగా తెలుసుకోండి!!

మనం ఎలాంటివారము, మన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మనకంటే అవతల మనల్ని చూసే వారికే బాగా తెలుస్తుంది. అయితే సాముద్రికా శాస్త్రంలో కొన్ని శరీర భాగాల ఆకృతి ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు అని చెబుతున్నారు. అయితే మన శరీరంలోని కళ్ళు, ముక్కు, చెవులు, పెదవులు వంటి శరీరభాగాలు వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలను చెబుతాయి.

ప్రస్తుతం మనం పెదవులు మన వ్యక్తిత్వాన్ని గురించి ఏం చెబుతాయి? ఎటువంటి పెదవులు ఉంటే ఎటువంటి వ్యక్తిత్వం ఉంటుంది? వంటి వివరాలను తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నిపుణులు మన పెదవుల ఆకృతికి మన వ్యక్తిత్వంతో సంబంధం ఉంటుందని చెబుతున్నారు. సన్నని పెదవులు ఉన్నవారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వారిని అంతర్ముఖులుగా చెబుతారు.

Personality depends on the shape of the lips.. Know the details!!

చిన్న మరియు బొద్దుగా ఉండే పెదవులు ఉన్నవారు అన్నిటికంటే తమను తాము క్రెడిట్ చేసుకుంటారు. వారు చాలా స్వార్థంతో కూడుకొని ఉంటారు. పెద్ద మరియు బొద్దుగా ఉండే పెదవులు ఉన్నవారు సానుభూతి కలిగిన వ్యక్తులు ఉంటారు. వారికి మాతృ ప్రవృత్తి ఉంటుంది. మీడియం సైజు పెదవులు ఉన్నవారు సమతుల్య జీవితాన్ని గడుపుతారు.

పై పెదవి పెద్దగా ఉన్నవారు కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటారు. సన్నని పై పెదవి ఉన్నవారు నిరంతరం సరదాగా గడపడానికి ఇష్టపడతారు. చాలా మందపాటి, వెడల్పైన పెదవులు కలిగిన వారు ఎప్పుడు ఏదో ఒక వాదనలకు తెర తీస్తారు. ఏదో ఒక అవమానాలను ఎదుర్కొంటారు. చాలా మొండి పట్టుదలను కలిగి ఉంటారు.

బయటకు వంగినట్టు పెదవులు ఉన్నవారు అనేక హెచ్చుతగ్గులను అనుభవిస్తారు. ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడే వీరు, చెడు అలవాట్లకు కూడా లోనయ్యే ప్రమాదం ఉంది. గులాబీ రంగు పెదవులు ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి పెదవులు ఉన్నవారు తెలివైన వారు, మంచి హృదయం కలవారు. అలాగే ఎర్రని పెదవులు ఉన్నవారు చాలా అదృష్టవంతులు. అలాంటి వారు తమ జీవితంలో అన్ని ఆనందాలను పొందుతారు.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+