2025లో రాహు కేతువుల వలన వీరికి మహారాజయోగం!
జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతువులకు నీడ గ్రహాలుగా, కీడు గ్రహాలుగా పేరు ఉంది. అయితే ఒక్కొక్కసారి ఈ గ్రహాలు ఉచ్చ స్థితిలో సంచారం చేసినప్పుడు కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను తీసుకువస్తాయి. 2025 సంవత్సరంలో ఈ రెండు గ్రహాలు తమ కదలికలను మార్చుకోబోతున్నాయి. ఇది కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలను అదృష్టాన్ని తెస్తుంది.
2025లో రాహు కేతువుల సంచారం
2025లో రాహువు కేతువులు వారి ప్రస్తుత స్థానాల నుంచి కొత్త స్థానాలకు మారనున్నారు. ఇది అన్ని రాశుల వారిపైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మే 18వ తేదీన రాహువు మీనరాశి నుండి కుంభరాశికి, కేతువు కన్యరాశి నుండి సింహరాశిలోకి సంచరిస్తారు. ఇది కొన్ని రాశులవారి జీవితాలలో సానుకూల మార్పులకు కారణం అవుతుంది. అన్ని రకాలుగా వారికి వృద్ధిని తీసుకువస్తుంది. ఇక రాహుకేతువుల కారణంగా 2025లో అదృష్టాన్ని పొందే రాశులేమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
2025 లో రాహు కేతువుల సంచారం కారణంగా మిధున రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు వర్తక వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు ఇంతకాలం ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి
2025లో ధనుస్సు రాశి వారికి రాహు కేతువుల సంచారం కారణంగా కలిసి వస్తుంది. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఏ పని చేసిన విజయాన్ని సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అవకాశాలు వస్తాయి.
మకర రాశి
2025లో రాహు కేతువుల సంచారం మకర రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. మకర రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.. మీరు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. మకర రాశి వారికి ఇది పురోగతిని సాధించే సమయం. ఆరోగ్యం బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications