రాసిపెట్టుకోండి.. మే నెలలో నక్కతోక తొక్కే రాశులవారు వీరేనన్న రాహు కేతువులు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా, కీడు గ్రహాలుగా భావిస్తారు. రాహు కేతువులు నిదానంగా సంచారం చేసే గ్రహాలు. ఈ రెండు తిరోగమనం లోనే సంచారం చేస్తాయి. అటువంటి రాహు కేతు గ్రహాలు త్వరలో తమ రాశులను మార్చుకోనున్నాయి.
రాహు కేతువుల సంచారం
మే 18వ తేదీన రాహువు మీన రాశి నుండి కుంభ రాశిలోకి, కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తారు. ఇక రాహు కేతువుల రాశుల మార్పు 12 రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
రాహు కేతువుల సంచారం మేష రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారికి ఆర్థిక లాభాలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మేష రాశి వారికి జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. కష్ట సమయాల నుండి ఉపశమనం లభిస్తుంది.
మిధున రాశి
మిధున రాశి జాతకులకు రాహు కేతువుల సంచారం కారణంగా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. మిధున రాశి వారు చేసే ప్రతి పనిలోనూ విజయాలను సాధిస్తారు. వీరికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మిధున రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు.
సింహరాశి
రాహు కేతువుల సంచారం కారణంగా సింహరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. సింహ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి .సింహరాశి వారి సంపద పెరుగుతుంది. కుటుంబంతో వీరు సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అప్పుల బాధ నుండి బయటపడతారు.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి జాతకులకు రాహు కేతువుల సంచారం సానుకూల ఫలితాలను తెస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. పనిలో ఎదురయ్యే సవాళ్లను ఈజీగా పరిష్కరించుకొని ముందుకు సాగుతారు.
మకర రాశి
మకర రాశి వారికి రాహు కేతువుల సంచారం ఫలితంగా మంచి జరుగుతుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. వీరి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగుంటుంది. సమాజంలో మకర రాశి వారి గౌరవం పెరుగుతుంది. ఇంట్లో సుఖశాంతులు వస్తాయి. ఈ సమయంలో మకర రాశి వారు ఏ పని చేసిన లాభాలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications