18ఏళ్ళ తర్వాత 2025లో వీరిని కుబేరులను చేస్తున్న రాహువు శని రాశి సంచారం!

2025 సంవత్సరంలో గ్రహాల మార్పులు అన్ని రాశుల వారి జీవితాలలోనూ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025లో శని రాశి లోకి రాహువు ప్రవేశం జరగబోతోంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత రాహువు శని ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. మే 18వ తేదీన 2025న శని రాశి అయిన కుంభరాశిలోకి సంచరించబోతున్నాడు. శని ఇంట్లో రాహువు సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది.ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
2025లో రాహువు సంచారం వృషభరాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. రాహువు సంచారం కారణంగా వృషభరాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది .ఈ సమయంలో వృషభరాశి జాతకులు అనేక విధాలుగా లబ్ధిని పొందుతున్నారు. వర్తక వ్యాపారాలు చేసే వారు వేసుకునే ప్రణాళికలు ఇప్పుడు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ఎప్పటినుంచో వసూలు కాని మొండిబాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

Rahu-Saturn transit will make these zodiac signs Kuberas in 2025 after 18 years

కన్యారాశి
రాహువు సంచారం కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కన్య రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. రాహువు సంచారం మీ వ్యాపారంలో మంచి మార్పులకు కారణం అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. వివాహితులకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అలాగే ఆఫీసులలో పెద్ద బాధ్యతలు కూడా నిర్వర్తించగలుగుతారు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి రాహువు సంచారం శుభప్రదంగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో వీరు తమ లక్ష్యాలను ఈజీగా చేరుకోగలుగుతారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. విద్యార్థులు కెరీర్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు ఆర్థిక పురోగతిని చూస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. రాజకీయ రంగాలకు సంబంధించిన వారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ధనుస్సు రాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

కుంభరాశి
18 సంవత్సరాల తర్వాత శని ఇంట్లో రాహువు సంచారం కుంభరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సంబంధించి శుభవార్తలు వింటారు . వృత్తిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+