శని రాశిలోకి రాహువు.. ఈ రాశులవారు 2026కల్లా కుబేరులవ్వటం ఖాయం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశులవారి పైన ప్రభావాన్ని చూపిస్తాయి అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రాహువు బృహస్పతి రాశి అయిన మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు త్వరలో శని రాశిలో సంచరించబోతున్నాడు. రాహువు శని రాశి అయిన కుంభరాశిలో త్వరలో సంచరిస్తాడు. శని గ్రహం మాదిరిగానే రాహువు కూడా నెమ్మదిగా కదిలే గ్రహం. రాహువు 18 నెలలకు ఒకసారి తమ రాశిని మార్చుకుంటాడు.
శనిరాశిలో రాహువు.. అదృష్టవంతులయ్యే రాశులు
గత సంవత్సరం 2023లో మీనరాశిలో ప్రవేశించిన రాహువు 2025లో మళ్లీ తన రాశిని మార్చుకోబోతున్నాడు. 2025 మే 18వ తేదీన రాహువు కుంభరాశిలో తిరోగమన దశలో ప్రవేశిస్తాడు. రాహువు 2026వరకు శని రాశి అయిన కుంభరాశిలోనే ఉండబోతున్నాడు ఈ సమయంలో రాహు ప్రభావం కొన్ని రాశులకు అదృష్టాన్ని ఇస్తే, మరి కొన్ని రాశులను దురదృష్టవంతులుగా చేస్తుంది. అయితే 2026 నాటికి రాహు సంచారం కారణంగా అదృష్టవంతులయ్యే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
కుంభ రాశిలో రాహు సంచారం వల్ల మేష రాశి వారికి శుభాలు కలుగుతాయి. మేష రాశి వారి వర్తక, వ్యాపారాలు ఈ సమయంలో లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారస్తులు మంచి వ్యాపార ఒప్పందాలను చేసుకుంటారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇది విద్యార్థులకు కూడా మంచి సమయం. మేషరాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి
కుంభ రాశిలో రాహువు సంచారం మకర రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుంభరాశిలోకి రాహు సంచారం కారణంగా మకర రాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వర్తక వ్యాపారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకుని సంతోషంగా జీవిస్తారు.
కుంభరాశి
కుంభ రాశి వారికి కుంభరాశిలో రాహువు సంచారం కలిసి వస్తుంది. ఈ సమయం వీరికి శుభప్రదంగా ఉండబోతుంది. జీవితంలో వచ్చే అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం ఉంటుంది. 2026 వరకు ఈ రాశి వారికి సంపదకు ఎటువంటి లోటు ఉండదు. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితం గడుపుతారు. జీవిత భాగస్వామితో ప్రశాంతమైన క్షణాలను ఆనందిస్తారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి ఈ సమయంలో ప్లాన్ చేసుకోవచ్చు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications