12సంవత్సరాల తరువాత అరుదైన యోగం.. 2024లో ఈ రాశులవారికి తిరుగులేదబ్బా!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం వివిధ రాశుల వారి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు గ్రహాల సంచారం వివిధ యోగాలను ఏర్పరుస్తుంది. కొన్ని శుభ యోగాలు కాగా కొన్ని అశుభ యోగాలు. అయితే ప్రస్తుతం రాజ్ లక్షణ రాజయోగం త్వరలో ఏర్పడనుంది. దీనివల్ల 2024లో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని చెప్తున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. 12సంవత్సరాల తర్వాత ఈ అరుదైన రాజయోగం ఏర్పడిందని అంటున్నారు.
డిసెంబర్ 16 వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే సమయంలో బృహస్పతి మేష రాశిలో ఉంటాడు.ఈ సమయంలో అత్యంత శక్తివంతమైన రాజ్ లక్షణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ముఖ్యంగా మేష రాశి, సింహరాశి, ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. వారికి ఈ రాజయోగం తో పంట పండుతుంది.

మేషరాశి వారికి రాజ్ లక్షణ రాజయోగం కారణంగా లబ్ది జరుగుతుంది. మేష రాశికి చెందిన లగ్న గ్రహంలో బృహస్పతి ఉండటం వల్ల మేష రాశి వారికి రాజ్ లక్షణ రాజయోగం శుభప్రదంగా మారుతుంది. ఈ సమయంలో వీరు పని నుండి లబ్ది పొందగలుగుతారు. ఇతరుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఈ రాజయోగం ఏర్పడడం వల్ల చాలాకాలంగా ఎదురు చూస్తున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.
ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసిన శుభప్రదం అవుతుంది. జీవితంలో అనేక విషయాల్లో విజయాలు సాధిస్తారు. న్యాయపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఇతరుల నుండి ఈ సమయంలో ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం.
సింహరాశి వారికి రాజ్ లక్షణ రాజయోగం లబ్ధిని చేకూరుస్తుంది. మీరు నిర్దిష్టమైన పనులను సకాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సుఖంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వివిధ ప్రదేశాలకు పర్యటించే అవకాశం ఉంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబం నుంచి ఉత్తమ ఫలితాలను ఆశించవచ్చు. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది.
ధనుస్సు రాశి వారికి రాజ్ లక్షణ రాజయోగం బాగా కలిసొస్తుంది. రాజ్ లక్షణ రాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. వారు అనుకున్న సమయంలో పనులను పూర్తి చెయ్యగలుగుతారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్ లో ప్రమోషన్లకు అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం రక్షించబడుతుంది. ఈ సమయంలో చేసుకున్న వివిధ ఒప్పందాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications