రాఖీ పండుగ నాడు చెయ్యాల్సిన పనులు, అస్సలే చెయ్యకూడని పనులు!
ఈ సంవత్సరం ఆగస్టు 19వ తేదీన దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకోబోతున్నాం ఈసారి రక్షాబంధన్ చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు. ఈసారి రక్షాబంధన్ శ్రావణ సోమవారం నాడు రావడం ఒక విశేషం అయితే రక్షాబంధన్ రోజు ఏడు విశేష శుభయోగాలు ఏర్పడుతున్నాయి. రక్షాబంధన్ నాడు రవి యోగం, శశ రాజయోగం, బుధాదిత్య యోగం, శోభనయోగం, సర్వార్ధ సిద్ధియోగం, శుక్రాదిత్య యోగం, లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతున్నాయి.
రాఖీ ఇలా కడుతున్నారా?
సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీకగా చెప్పుకునే రక్షాబంధన్ రోజు తోడబుట్టిన వారి జీవితాలలో అపారమైన ఆనందాన్ని, శ్రేయస్సును కలిగించటానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం. రాఖీ పండుగ అంటేనే అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టేసి వారికి స్వీట్లు తినిపించే కానుకలు తీసుకుంటే సరిపోతుందని చాలామంది భావిస్తూ ఉంటారు.

నియమ నిష్టలతో రాఖీ
అయితే అలా ఎవరూ రాఖీ కట్టకూడదు. రాఖీ పండుగ నాడు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.రాఖీ పండుగ నాడు అన్నదమ్ములకు రాఖీ కట్టే వేడుకను చాలా నియమనిష్ఠలతో చేయాలి. మనం వినాయక చవితి, దసరా పండుగలను ఏ విధంగా అయితే నియమాలతో జరుపుకుంటామో అంతే నిష్టగా రాఖీ పండుగ చేసుకోవాలి.
రాఖీ కట్టేటప్పుడు గుర్తు పెట్టుకోండి
రాఖీ కట్టే ఆడపిల్లలు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి రాఖీ కట్టే ముందు అన్నదమ్ములకు పీట వేసి కూర్చోబెట్టి రాఖీ కడితే ఎంతో మంచిది. తూర్పు కాని, ఉత్తరం వైపు కానీ సోదరుడు అభిముఖంగా ఉండేలా కూర్చోబెట్టి రాఖీ కట్టాలి. దక్షిణ దిశ వైపు పొరపాటున కూడా కూర్చోబెట్టకూడదు. దక్షిణ దిశవైపు కూర్చోబెట్టి రాఖీ కడితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది.
రాఖీ ఇలా కట్టండి
అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టే ముందు దేవుడికి దండం పెట్టుకోవాలి. వినాయకుడి ఫోటోకు కానీ విగ్రహానికి కానీ బొట్టు పెట్టి ముందు ఆయనకు రాఖీని సమర్పించిన తర్వాతనే సోదరులకు రాఖీని కట్టాలి. సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి రాఖీ కట్టాలి. ఆ తరువాత మిఠాయి తినిపించాలి.
భద్ర సమయంలో రాఖీ కట్టకండి,రాఖీ కట్టేటప్పుడు ఈ పని చెయ్యండి
ఈ మొత్తం ప్రక్రియ శ్రావణ శుక్లపక్ష పౌర్ణమితి నాడు భద్ర సమయంలో చేయకూడదు. అంతేకాదు రాఖీ కట్టేటప్పుడు సోదరీ సోదరులు ఎలాంటి ఆపద రాకూడదని శ్లోకం చదివి మరి రాఖీ కట్టాలి. "యేన బద్దో బలీ రాజా దానవేంద్రో మహాబల తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల" అనే మంత్రాన్ని చదువుకొని రాఖీ కడితే మంచి జరుగుతుంది.












Click it and Unblock the Notifications