rasi phalalu today: ఈ రాశులవారికి శుభం; ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు!!

గ్రహాల గమనం కారణంగా ఏరోజుకారోజు వివిధ రాశి చక్రాల వారి జాతకాలు మారుతూ ఉంటాయి. ఇక నేడు అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉంది? ఈరోజు ఏ రాశి వారికి కలిసి వస్తుంది? ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. మేష రాశి వారికి మంచి సమయం నడుస్తోంది. వ్యాపారంలో అనుకూల మైనటువంటి ఫలితాలు ఈ రోజు వస్తాయి. విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర సందర్శన చేయడం మరింత మెరుగైన ఫలితాలను ఇస్తుంది.

rasi phalalu today Auspicious for these zodiac signs Important things can be done

వృషభ రాశి
వృషభ రాశి వారికి నేటి శ్రమకి తగిన ఫలితం ఉంటుంది. ఈరోజు తోటి వారి సహకారంతో అనుకున్న పనులన్నీ వృషభ రాశు వారు పూర్తి చేయగలుగుతారు. పెద్దల నుంచి మంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. నేడు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.

మిధున రాశి
మిధున రాశి వారు చిత్తశుద్ధితో చేసే ఏ పనైనా ఫలవంతం అవుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మిధున రాశి వారు ఈ రోజు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. నేడు వీరు లక్ష్మి స్తుతి చేయడం మంచిది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈ రోజు దైవ బలంతో పనులను పూర్తిచేస్తారు. నేడు ఉద్యోగస్తులకు మంచి సమయం. ధర్మ సిద్ధి ఉంటుంది. నేడు వీరి బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్ట దైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

సింహరాశి
సింహ రాశి వారికి అనుకున్న ఫలితాలు వస్తాయి. అయితే కొన్ని విషయాలలో మనో నిబ్బరంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.సింహ రాశి జాతకులు ముఖ్య విషయాల్లో ఆలస్యం చేయకుండా ఉండాలి. ఆరోగ్యకరమైన పద్ధతులను అవలంబించడం మంచిది. గో సేవ చేయడం మంచిది.

కన్యారాశి
కన్య రాశి జాతకులు నేడు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కన్య రాశి వారికి ప్రారంభించిన పనుల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కన్యారాశి జాతకులు నేడు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+