గజకేసరి యోగంతో కొన్ని రాశుల వారి ప్రతికూలతలకు నివారణలు!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగం అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటి. గురువు లేదా బృహస్పతి చంద్రుడితో కలిసినప్పుడు, లేదా ఒకదానికొకటి ప్రత్యక్షంగా కనిపించినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి యోగం అపారమైన జ్ఞానాన్ని, కీర్తిని, శక్తిని, విలాసాలను ఇస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ఒక రాజయోగం అని చెప్పొచ్చు.

అయితే గజకేసరి యోగం ఒక శుభ యోగం అయినప్పటికీ బృహస్పతి చంద్రుడు రాహు కేతువులతో కలిసి ఉన్నప్పుడు, సరైన స్థానాలలో లేనప్పుడు గజకేసరి యోగం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అనేక ఆర్ధిక నష్టాలను కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతకు భగ్నం కలిగిస్తుంది. కుటుంబంలో చిచ్చు పెడుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం గజకేసరి యోగం మేషరాశి, తులా రాశి, ధనుస్సు రాశి, కర్కాటక రాశి జాతకులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.

Remedies for negative results to those zodiac signs with gajakesari yoga

మేష రాశి, కర్కాటక రాశి, తులా రాశి, ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇది మీ జీవితంలో చాలా వరస్ట్ పీరియడ్ గా ఉంటుందని అంటున్నారు. అయితే గజకేసరి యోగం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వారు ఆ దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలను చేస్తే మంచిదని చెబుతున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు.

గజకేసరి యోగం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చేవారు ముఖ్యంగా చెయ్యవలసిన నివారణల విషయానికి వస్తే వారు తప్పనిసరిగా శివుడిని పూజించాలి. శివుడికి రుద్రాభిషేకాన్ని చేయాలి. గజకేసరి యోగం వల్ల కలిగే నష్టాల నుండి బయటపడడానికి మెడలో వెండి గొలుసు వేసుకోవాలి.

వెండి గ్లాస్ లోనే నీళ్లను తాగాలి. వీధి కుక్కలకు మరియు ఆవులకు ఆహారాన్ని పెట్టాలి. దానధర్మాలు చేయాలి. పేదలకు బట్టలు, దుప్పట్లు వంటివి దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. గజకేసరి యోగం ప్రతికూల ఫలితాల నుండి బయటపడడానికి విష్ణు సహస్రనామ పారాయణం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+