సంక్రాంతికి ముందు భోగీ: విశిష్టత ఏమిటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151 

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

మనము సహజంగా పండగలన్ని చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసుకొవడం జరుగుతుంది.కాని ఈ సంక్రాంతి మాత్రం సూర్యున్ని ప్రధానంగా తీసుకుని నిర్ణయం చేయడం జరుగుతుంది.సంక్రాంతి పండగ అనేది మూడు రోజుల పర్వదినం.తిధితో సంబంధం లేని పండగ.ఈ మూడు రోజుల పండగలలో మొదటి రోజు భోగి పండగ. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేది భోగి. దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు ఈ రోజు.

భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇండ్లకు వచ్చే కాల సమయం.ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానానంతరం ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలికి భోగి మంటలలో పాత పనికిరాని వస్తువులను వేసి పీడలను,అరిష్టాలను తొలగించుకుంటారు.

Sankranti: The importance of Bhogi

తెల్లవారకముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభం అవుతుంది.మనలో ఉన్న బద్దకాన్ని,అశ్రద్ధను,మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద,ఆప్యాయతలతో కూడుకొని ఉన్నజీవితాన్ని ప్రారంభిస్తున్నాము అని ఆత్మారామునికి మాట ఇచ్చి భవగత్ సన్నిదిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది.

ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు భోగి పండ్లను పోయడం వలన వారికి ఉన్న బాలారిష్టాలు,ఇతర దోషాలు తొలగి పోతాయి.పిల్లలకు భోగి పండ్లను సాయంకాల సమయంలో పోస్తారు.ఈ భోగి పండ్లలో రేగుపండ్లు,జీడిపండ్లు,కొన్ని చిల్లర నాణేములను,బియ్యం పిండితో చేసి నువ్వుల నూనేలో వేయించిన చిన్ని చిన్న వేపగింజల ఆకారంలో తాల్కలు,చెరుకుగడ ముక్కలను ఈ ఐదింటిని ఒకచోట కలిపి ఇంట్లో ఉన్న పిల్లలో ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన వారికి కొత్త బట్టలు వేసి కూర్చోవడానికి చాప,దుప్పటి లాంటిది వేసి తూర్పు వైపు ముఖం ఉండేలాగ కూర్చో బెట్టి నుదటన కుంకుమ బొట్టు పెట్టి ఇరుగు పోరుగు పిల్లలను పిలిచి భోగి పండ్లను రెండు చేతులతో పిల్లల తలపై నుండి క్రిందకు జారపడే లాగ పోయాలి. ఆ క్రింద పడిన భోగి పండ్లను పిల్లలు సరధా పడుతు,పోటి పడుతూ ఏరుకుని తింటారు.

ఈ సంక్రాంతి భోగి రోజు కొన్ని ప్రాంతలలో ముత్యైదువలు కొత్త గాజులు వేసుకుంటారు.గాజులు తొడిగిన గాజుల వ్యాపారికి వారి పంట పోలాలలో పండిన కొత్త వడ్లను,ధాన్యములను అనవాయితిగా ఇచ్చి సంత్రుప్తిగా సాగనంపుతారు.ఇంటికి వచ్చిన కొత్త అళ్ళులు,కూతుర్లతో సరదాగా ఆనందగా ఉంటారు.ఈ రోజును కుటుబంలో ఎంతగానో ఆనంద ఆప్యాయతల మధ్య అనుభూతులు పొందుతారు.పేద గొప్ప అనే తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులు,ఆత్మీయులతో ఆనందగా గడుపుతారు.

ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ధనుర్మాసంలో చివరి రోజు ఈ రోజు కావడం చేత దినమంతా దైవ చింతనతో గడుపుతారు. విష్ణుచిత్తుని కుమార్తె ఆండాళ్ ఈ ధనుర్మాసంలోనే కాత్యాయిని వ్రతం చేసి సాక్షాత్తు భగవంతున్ని మెప్పించింది.భవంతున్ని మనస్సు పెట్టి ఎవరైతే ద్యానిస్తారో వారి పట్ల దేవుడు వారి వారి కోరిన కొర్కేలను తప్పక తీరుస్తాడు అని మనకు పురాణ,ఇతిహాసాల ద్వార తెలుస్తుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explains the importance of Bhogi, which will be celebrated a day before Sankranti.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి