మార్చిలో వీరింటికి డబ్బుల మూటలను మోసుకొస్తామని ప్రకటించిన శని, రాహువులు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, సంయోగం అన్ని రాశులవారి జీవితాలను నిర్దేశిస్తాయని చెప్పుకున్నాం. 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల మార్పులు, ముఖ్య గ్రహాల సంయోగాలు జరగబోతున్నాయి అనేది కూడా ఇప్పటికే అందరికీ తెలుసు. ఈ సంవత్సరం శని, రాహువు, కేతువుతో పాటు గురు గ్రహాలు తమ రాశి పరివర్తన గావిస్తున్నాయి. ముఖ్యంగా 2025 సంవత్సరంలో కుంభరాశి నుంచి శని మార్చి నెలలో మీనరాశిలోకి వెళ్తాడు.

శని రాహువుల సంయోగం
మార్చి 29వ తేదీన శని మీనరాశిలోకి సంచారం చేస్తాడు. అయితే అప్పటికే అక్కడ ఉన్న రాహువుతో శని సంయోగం చెందుతాడు. 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని రాహువుల అరుదైన కలయికకారణంగా అనేక రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. శని, రాహువుల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి సంపదల వర్షం కురుస్తుంది. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Saturn and Rahu have announced that they will bring bundles of money to these families in March

మేష రాశి
మీనరాశిలో శని, రాహువుల సంయోగం కారణంగా మేష రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. రాహువు మేషరాశిలో 12వ స్థానంలో శనితో కలవటం కారణంగా వీరు ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు. ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభిస్తే మంచి జరుగుతుంది..ఈ ఏడాది చివరి వరకు మేషరాశి వారికి ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు. మేషరాశి వారి వైవాహిక జీవితం కూడా సంతోషదాయకంగా ఉంటుంది. ఇది మేషరాశి వారికి శుభ కాలం.

వృషభరాశి
మీనరాశిలో శని, రాహువుల సంయోగం కారణంగా వృషభరాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. రాహువు వృషభ రాశిలో 12 వ స్థానంలో శనితో కలవటం కారణంగా వృషభ రాశి జాతకులకు ఆర్ధిక స్థితి బలోపేతం అవుతుంది. వృషభ రాశి వారి చిరకాల కోరికలు తీరుతాయి. ధనార్జనా మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారి పనిలో పురోగతి సాధించి ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు.

తులా రాశి
తులా రాశి వారికి శని, రాహువుల సంయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. 2025లో తులారాశి వారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. తులారాశి వారి దాంపత్య జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. ఈ సమయంలో సుఖంగా రాజభోగాలతో తులతూగుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. ఇది తులారాశి వారికి సంపదలను ఇచ్చే సమయం. వ్యాపారంగంలో ఉన్నవారు మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు.

కుంభరాశి
కుంభరాశి వారికి రాహు, శని కలయిక కారణంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు అన్ని విధాలా శుభ ప్రయోజనాలను పొందుతారు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. ఇది అన్ని విధాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+