2025లో వీరికి ఐశ్వర్యాన్ని, రాజభోగాలను ప్రకటించిన శని!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శని దేవుడు కర్మ ఫలితాలను అందించే దేవుడు గా చెబుతారు. కష్టపడి పని చేసే వ్యక్తులు ఎవరైనా శని దేవుడు చేత ఆశీర్వదించబడతారు. శని దేవుడు ప్రస్తుతం తిరోగమనంలో కుంభరాశిలో తిరుగుతున్నారు. నవంబర్ 15వ తేదీన శనిదేవుడు కుంభరాశిలో నేరుగా సంచరించనున్నారు. ఆ తరువాత ఈ మార్చి 29 2025న శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు.
మీనరాశిలో శని సంచారం
శని మీనరాశిలోకి ప్రవేశం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అపారమైన విజయాలను అందిస్తుంది. మార్చి 29 2025న శనిగ్రహం దహన స్థితిలోనే మీనరాశిలోకి వెళుతుంది. ఆ తర్వాత మార్చి 31 2025న శని గ్రహం ఉదయం 12:43 నిమిషాలకు ఉదయిస్తుంది. 2025 జూలై 13న మళ్లీ శనిగ్రహం మీనరాశిలో తిరోగమనం చెందుతుంది. ఇదిలా ఉంచితే మీనరాశిలోకి శని దహన స్థితిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది.

మకర రాశి
శని కుంభ రాశి నుండి మీన రాశిలోకి వెళ్ళినప్పుడు మకర రాశి వారికి సడే సతి నుంచి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న వారికి ఉపశమనం దొరుకుతుంది. పనిచేసే చోటా గుర్తింపు వస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శని కుంభరాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశించడం శని దయ్యా నుండి ఉపశమనం కలిగిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కెరీర్లో విజయాలు వస్తాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఈ సమయంలో అన్ని విధాల ఏ పని చేసినా కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో శని మీనరాశిలోకి ప్రవేశించడంతో శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి. వృశ్చిక రాశి జాతకులు ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో వీరు భారీ ఆర్థిక లాభాలను పొందుతారు. మానసిక సమస్యల నుంచి దూరంగా ఉంటారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. పిల్లలనుండి శుభవార్తలు వింటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications