శని వక్రదృష్టి.. కష్టాలు, ధన నష్టాలు.. ఈ రాశులవారు జాగ్రత్త!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. క్రమశిక్షణకు మారుపేరైన శని శుభాలనే కాదు కష్టాలను కూడా కలిగిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 16వ తేదీన సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించిన వెంటనే శని చెడుదృష్టి ఆయనపైన పడుతుంది. శని యొక్క వక్రదృష్టి కారణంగా షడష్టక యోగం ఏర్పడింది. దీని కారణంగా అనేక రాశులవారి జీవితంలో సమస్యలు, ఆర్థిక సంక్షోభం కొనసాగుతుంది.
వృషభ రాశి
శని యొక్క వక్ర దృష్టి వల్ల వృషభ రాశి వారికి ఏమాత్రం ప్రయోజనాలు చేకూరవు. ఈ రాశి వారికి శారీరక మానసిక సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా ఈ సమయంలో నష్టపోతారు. రిలేషన్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తాయి. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం.

కన్యారాశి
శని వక్ర దృష్టి కారణంగా కన్య రాశి జాతకులకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. కన్య రాశి వారు ఈ సమయంలో కుటుంబ సభ్యులు స్నేహితులతో ఘర్షణలకు దిగవచ్చు .ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం వహిస్తే భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. కన్యా రాశి వారు ఈ సమయంలో అనేక శారీరక అనారోగ్యాలను ఎదుర్కొంటారు. కళ్ళ ఇన్ఫెక్షన్ తో బాధపడతారు. ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి
శని వక్ర దృష్టి కారణంగా మకర రాశి జాతకులకు ఇబ్బందులు ఉన్నాయి. శని ప్రభావంతో మకర రాశి జాతకులు ఏ పని చేసిన అడ్డంకులే వస్తాయి. కెరీర్ లో ఏమాత్రం పురోగతి ఉండదు. సహోద్యోగులతో పాటు పై అధికారులతో వాగ్వాదాలకు దిగే అవకాశం ఉంది. ఉద్యోగాలు మారే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారంలోనే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబంతోను గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి
శని వక్రదృష్టి కారణంగా కుంభ రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. కుంభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల మయంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యే పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యులతోనూ, ఘర్షణలకు దిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదంటే అనర్ధాలు తప్పవు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications