30ఏళ్ళ తర్వాత శని నక్షత్ర మార్పుతో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే!!
న్యాయానికి, క్రమశిక్షణకు అధిపతి అయిన శని ఏప్రిల్ 6వతేదీన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. 30సంవత్సరాల తర్వాత శని శతభిషా నక్షత్రం నుండి పూర్వాభాద్ర నక్షత్రంలోకి రవాణా అయ్యాడు. శని నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తే కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ 6వ తేదీన శని దేవుడు నక్షత్రాన్ని మార్చుకోవడం వల్ల అదృష్టవంతులు అయిన రాశులవారు ఎవరు? వారు ఎటువంటి ప్రయోజనాలను పొందుతారు? తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి జాతకులకు శని నక్షత్ర మార్పు ఆర్థికలాభాలను, శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు సంబంధాలలో బలోపేతం అవుతారు. జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగిఉంటారు. ఒంటరిగా ఉన్నవారు ప్రేమలో పడవచ్చు. ఇక కెరీర్ మరియు ఫైనాన్స్ విషయంలో కూడా వీరు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. జాతకుల ఆదాయం మరింత పెరుగుతుంది. నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.

మిధున రాశి
శని నక్షత్రం మార్పు మిధున రాశి జాతకులకు అన్ని విధాల లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో మీ కుటుంబంలో ఆనందం మరియు ప్రేమ పెరుగుతుంది. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఏదైనా వాహనాన్ని లేదా స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉద్యోగం చేసే వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఆస్తుల కొనుగోలు వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి
శని నక్షత్రం మార్పు సింహరాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఉద్యోగస్తులకు తోటి సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం మధురంగా, సంతోషదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు చేసే వారికి ఈ సమయం శుభసమయం.
కన్యారాశి
కన్యారాశి జాతకులకు శని నక్షత్రం మార్పు మంచి ఫలితాలను ఇస్తుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక లాభాలను పొందుతారు. వారిలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈ సమయంలో బాగా పెరుగుతాయి. ఎటువంటి సందర్భం అయినా మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి కనిపించడంతో పాటు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు కూడా మీకు అందుతాయి.
ధనుస్సు రాశి
శని నక్షత్రం వరకు ధనస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా ఇది మీకు లాభాలను చేకూరుస్తుంది. ధనస్సు రాశి జాతకులు వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రేమ జీవితం కూడా ఈ సమయంలో ఉత్తమంగా ఉంటుంది. వ్యాపారస్తులు మంచి పురోగతిని సాధిస్తారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుంది. విదేశాలలో వ్యాపారాలు చేసేవారు లాభపడే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications