కుంభరాశిలో శని తిరోగమనం; ఈ రాశులవారికి ఆరునెలలు అష్టకష్టాలు!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో శనికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. శని కేవలం కష్టాలను కలిగించే దేవుడు మాత్రమే కాదు, ధనాన్ని వృద్ధిని, సంతోషాన్ని కూడా ఇచ్చే దేవుడు. అయితే శని ప్రతికూల ఫలితాలను ఇస్తే మాత్రం ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. శని గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి ప్రయాణం చేయడానికి రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది.

కుంభరాశిలో శని తిరోగమనం.. ప్రతికూల ఫలితాలు
జూన్ 29వ తేదీన శని రాత్రి 11 గంటల 41 నిమిషాలకు కుంభరాశిలో తిరోగమనం చెందుతుంది. ఇక శని గమన మార్పు నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. దీనివల్ల 4 రాశుల వారు తీవ్రంగా ప్రభావితం అవుతారు. కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల మేషరాశి, వృషభ రాశి , తులా రాశి, కుంభ రాశి జాతకులు ఆరు నెలల కాలం అనేక ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు.

Saturn retrograde in Aquarius Six months of difficulties for these zodiac signs

మేషరాశి
కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల మేష రాశి వారికి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతుంది. కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల కర్కాటక రాశి వారికి కష్టానికి తగిన ఫలితం ఉండదు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు పోయే ప్రమాదం లేకపోలేదు.

వృషభరాశి
వృషభరాశి జాతకులు కుంభరాశిలో శని తిరోగమనం చెందే ఆరు నెలల కాలం చాలా జాగ్రత్త గా ఉండాలి. ఉద్యోగ, వ్యాపారాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఏమి మాట్లాడినా తప్పవుతుంది. అది అనేక సమస్యలను తెచ్చి పెడుతుంది. ఈ సమయంలో ఏ పని మొదలెట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంది. కుటుంబంలోనూ సమస్యలు పెరిగిపోతాయి.

కుంభరాశి
శని తిరోగమనం కారణంగా కుంభరాశి జాతకులు తీవ్రమైన ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల కుంభ రాశి జాతకులకు మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఈ సమయంలో తక్షణం నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. నవంబర్ నెల వరకు ఎలాంటి వివాదాలలో తలదూర్చకుండా ఉండాలి. ఆర్ధిక సంక్షోభం వచ్చే ప్రమాదం లేకపోలేదు.

తులారాశి
కుంభరాశిలో శని తిరోగమనం కారణంగా తులారాశి జాతకులు ఈ ఆరు నెలల కాలం జాగ్రత్తగా ఉండాలి. వీరు ఈ సమయంలో ఆర్ధికంగా నష్టపోయే చాన్స్ ఉంటుంది. కాబట్టి ఆర్ధిక విషయాల్లో జాగ్రత్త. ఆరోగ్య విషయంలోనో ఇబ్బందులు ఎదురవుతాయి. కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు అనుకూలంగా ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ ఫలించదు. దురాశకు పోతే నష్టపోతారు. డబ్బులు ఈ సమయంలో ఎవరికి ఇచ్చినా తిరిగి రావు.. జాగ్రత్త.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+