అక్టోబర్ లో వీరికి ఊహించని సంపద..శని శాసనం!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాలలో ముఖ్య గ్రహంగా చెప్పుకునే, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే శని గ్రహం చేసే సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారు ప్రభావితం అవుతున్నారు. శని మన సౌర వ్యవస్థలో శక్తివంతమైన గ్రహాలలో ఒకటి. అటువంటి శని అన్ని రాశి చక్రాలను నక్షత్రాలను పూర్తి చేయడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది .
శని నక్షత్ర సంచారం
అక్టోబర్లో శని పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఇది వివిధ రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల పైన సానుకూలంగా ప్రభావాన్ని చూపిస్తే, మరికొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ప్రస్తుతం మనం అక్టోబర్ మాసంలో శని నక్షత్ర సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి తెలుసుకుందాం.

కర్కాటక రాశి
శని నక్షత్ర సంచారం కర్కాటకరాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో కర్కాటకరాశి జాతకులు ఏ పని చేసిన లాభాలు వస్తాయి. వివిధ రంగాలలో అపారమైన విజయాలు వస్తాయి. ఈ రాశిలో తొమ్మిదవఇంట్లో శని సంచారం చేస్తాడు కాబట్టి ఈ సమయం అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఈ కాలంలో మీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కుంభరాశి
కుంభరాశి జాతకులకు శని నక్షత్ర మార్పు అదృష్టాన్ని ఇస్తుంది. కుంభరాశి వారి వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో మార్పులు వస్తాయి. కుంభరాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. కుంభ రాశి వారు పని కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ స్నేహితులతో కలిసే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సమాజంలో కుంభ రాశి వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి.
మీన రాశి
మీనరాశి జాతకులకు శని నక్షత్ర మార్పు అన్ని విధాల లాభాలను తెస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లాభాలు పొందుతారు. పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశించే శని మీనరాశిలో లగ్న గృహంలో ఉంటాడు దీనివల్ల కెరీర్లో మెరుగైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. రాజకీయరంగంలో ఉన్నవారు మంచి ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. పాత సమస్యల నుండి త్వరగా కోలుకుంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications