శనిదేవుడి దయతో శష రాజయోగం: నాలుగు రాశులవారి పంట పండినట్టే!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో వివిధ గ్రహాల చలనం రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహమైన శని చలనం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో ఉన్న శని, నవంబర్ నెలలో ప్రత్యక్ష చలనంలోకి మారుతుంది. ఆ సమయంలో శష రాజయోగం అని చెప్పబడే శని రాజ్య యోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది.
శష రాజయోగం వృషభ రాశి వారికి ఆర్ధిక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సమయంలో శని ఆశీస్సుల వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో గణనీయమైన ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగం కోసం చాలా కాలం నుండి అన్వేషిస్తున్న వారికి ఈ సమయంలో శుభవార్తలు అందుతాయి. శని ప్రత్యక్ష చలనంలో ఉన్నప్పటికీ వృషభ రాశి వ్యక్తులకు చాలా అనుకూలతలను ఇస్తుంది.

సింహ రాశి వారికి శష రాజయోగం భౌతిక సౌకర్యాలను అందిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి వాహనాలను కొనుగోలు చేయడానికి ఈ సమయం అనుకూలమైందిగా చెప్పబడింది. ఉద్యోగాలలో ఈ సమయంలో ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. న్యాయపరమైన విషయాలలో విజయాన్ని సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి వచ్చే అవకాశం ఉంది. సంపన్నమైన వైవాహిక జీవితం లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి.
తులా రాశి వారికి శష రాజయోగం వల్ల కలిసొస్తుంది. ఈ సమయంలో మీరు అపారమైన లాభాలను పొందుతారు. వర్తక వ్యాపారాలలో ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ బదిలీలు పదోన్నతులకు కారణమవుతాయి. కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
కుంభ రాశి వారికి శష రాజయోగం కలిసొస్తుంది. ఈ రాజయోగం వల్ల కుంభ రాశి జాతకులకు శని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. రియల్ ఎస్టేట్, వారసత్వ వ్యాపారాల నుండి లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. లాభదాయకమైన ప్రయాణ సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వాములు వృత్తిలో పురోగతిని సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications