శుక్రాదిత్య రాజయోగం: వీరికి సంపద వర్షం; విలాసవంతమైన జీవితం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో వివిధ రాశులలోకి గ్రహాల సంచారం కొనసాగుతుంది. మొత్తం 12 రాశుల పైన గ్రహాల సంచారం సానుకూల ఫలితాలను లేదా ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. అయితే నేడు గ్రహాల రారాజుగా పరిగణించే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. ఈ నెల అంతా సూర్యుడు మేషరాశి లోనే ఉంటాడు. ఇక ఇదే నెలలో సంపదకు కారకుడైన శుక్రుడు మేషరాశిలో సంచరించబోతున్నాడు.
ఈనెలలో శుక్రాదిత్య రాజయోగం
శుక్రుడు ఏప్రిల్ 24వ తేదీన మేషరాశిలో ప్రవేశిస్తాడు. ఇక మేషరాశిలో అప్పటికే సూర్యుడు ఉండడం వల్ల సూర్య శుక్ర సంయోగం వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. 18 సంవత్సరాల తర్వాత మేషరాశిలో ఏర్పడుతున్న శుక్రాదిత్య రాజయోగం కొన్ని రాశుల వారికి ధన యోగాన్ని కలిగించడంతోపాటు అదృష్టాన్ని ఇస్తుంది. శుక్రాదిత్య రాజయోగం వల్ల అదృష్టవంతులైన రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుంది.

మేషరాశి
మేషరాశిలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా మేషరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిలోనే సూర్య, శుక్ర కలయిక జరగడం వల్ల ఈ రాశి జాతకుల ఉద్యోగ వ్యాపారాలు పురోగమిస్తాయి. వివాహితుల జీవితం శుభకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త సవాళ్లను తీసుకుంటారు.
మిధున రాశి
శుక్రాదిత్య రాజయోగం కారణంగా మిధున రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాజయోగం మిధున రాశి జాతకుల జీవితంలో విలాసాలకు కారణం అవుతుంది . ఈ సమయంలో వీరు సంతోషంగా జీవిస్తారు. ఆర్దిక సమృద్ధిని సాధిస్తారు.
కన్యరాశి
శుక్రాదిత్య రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు మేలు జరుగుతుంది. ఈ సమయంలో కన్యారాశి వారు ఆర్థికంగా బలోపేతం అవుతారు. అనేకమార్గాలలో ఆదాయ వనరులు సమకూరుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమ సంబంధాలు దృఢంగా ఉండడంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
తులారాశి
శుక్రాదిత్య రాజయోగం కారణంగా తులా రాశి జాతకుల జీవితాలలో సానుకూలమైన మార్పులు వస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో లగ్జరీగా జీవిస్తారు. వ్యాపారం విస్తరించబడుతుంది. డబ్బు సంపాదనకు అనేక నూతన అవకాశాలు కనిపిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ఎప్పటి నుంచో వసూలు కాకుండా బకాయి ఉన్న డబ్బులు కూడా తిరిగి వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications