శుక్రాదిత్య రాజయోగంతో జనవరి నుండి మీ స్టార్ తిరుగుతుంది!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలు పైన ప్రభావాన్ని చూపిస్తాయి. 2026 సంవత్సరంలో సూర్య, శుక్ర గ్రహాల కలయిక మకర రాశిలో జరగబోతుంది. గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రతీక అయిన సూర్యుడు, సంపదలకు, విలాసాలకు, శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడు మకర రాశిలో 2026 జనవరి ఆరవ తేదీన సంయోగం చెందబోతున్నారు.
శుక్రాదిత్య రాజయోగం
ఈ కారణంగా శుక్ర సూర్య కలయికతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అదృష్టం, అపారమైన సంపదలు చేకూరుతాయి. రాజకీయాలలో విజయాలకు ఇది దారి తీస్తుంది. ఆర్ధిక పురోగతి కనిపిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మకర రాశి
మకర రాశిలో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మకర రాశి జాతకులకు కలిసి వస్తుంది. మకర రాశిలో లగ్న గృహంలో ఈ కలయిక జరగడం వల్ల వీరి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో ఏ పని చేసిన కలిసి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతుల అవకాశాలు వస్తాయి. ఆస్తి సంబంధిత లాభాలు వస్తాయి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
మేషరాశి
శుక్రాదిత్య రాజయోగం మేష రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మేషరాశిలో కర్మ గృహంలో ఈ సంయోగం జరగడం వల్ల, ఈ సంయోగం వీరికి అనుకూలంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు పురోగతిని చూస్తారు. నూతన ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారవేత్తలకు ఇది మంచి సమయం. పురోగతికి మార్గాలు ఉంటాయి. కుటుంబం తోను, బంధువులతోనూ మంచి సంబంధాలను కొనసాగిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి.
మీన రాశి
శుక్రాదిత్య రాజయోగం కారణంగా మీనరాశి జాతకులు శుభ ఫలితాలను చూస్తారు. మీనరాశిలో 11వ ఇంట్లో సూర్య, శుక్ర కలయిక జరగడం వల్ల ఈ సమయంలో మీన రాశి వారికి ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఊహించని లాభాలు వస్తాయి. పెట్టుబడులు మంచి రాబడులను తీసుకువస్తాయి. తండ్రితో సంబంధం బలపడుతుంది. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ మరియు లాటరీల నుండి ప్రయోజనాలు పొందుతారు.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications