చైత్ర నవరాత్రుల నుండి ఈ రాశులవారికి స్టార్ తిరిగినట్టే.. మీరున్నారా?
క్రోధి నామ ఉగాది పర్వదినం నుండి చైత్రమాసం ప్రారంభమైంది. చైత్రమాసం ప్రారంభంతోనే చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమయ్యాయి. నిన్నటి నుండే చైత్ర నవరాత్రులు ప్రారంభం కాగా, దుర్గాదేవిని వివిధ రూపాలలో భక్తులు విశేషంగా కొలుస్తున్నారు. అయితే ఈసారి చైత్ర నవరాత్రులు ముఖ్యంగా నాలుగు రాశులవారికి అద్భుతమైన ఫలితాలను తెస్తున్నాయి. ముఖ్యంగా నాలుగు రాశులవారి దశ చైత్ర నవరాత్రుల నుండి మారబోతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
చైత్ర నవరాత్రుల నుండి మేషరాశి వారి స్టార్ మారబోతుంది. మేషరాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. నవరాత్రులు మేషరాశి జాతకులకు మంచి ఫలితాలను ఇస్తాయి. చైత్ర నవరాత్రుల నుండి వీరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థికంగా మీరు బలోపేతం అవుతారు. పనిలో మీ సామర్థ్యం ఇతరులు మిమ్మల్ని చేరుకోలేని విధంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో కలిసి సంతోషంగా గడపడానికి ప్రాధాన్యతనిస్తారు. కుటుంబంతో సహా ఎక్కడికైనా వెళ్తారు.

వృశ్చిక రాశి
చైత్ర నవరాత్రుల రోజులు వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు రుణ విముక్తిని పొందుతారు. వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తారు. ఈ సమయంలో మీరు ఏం చేసినా కలిసి వస్తుంది. మీరు ఏ పని అనుకున్నా ఆ పని పూర్తవుతుంది. మీ ప్రేమ జీవితం, కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది.
ధనస్సు రాశి
చైత్ర నవరాత్రులు ధనుస్సు రాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తాయి. ధనుస్సు రాశి వారు వర్తక వ్యాపారాలలో చైత్ర నవరాత్రుల నుండి విజయాన్ని సాధిస్తారు. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి సమయం కేటాయిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. ఈ నవరాత్రులు మీకు ఆర్థిక ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి.
కుంభరాశి
కుంభ రాశి వారికి చైత్ర నవరాత్రులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఆర్థికపరమైన లబ్ధిని చేకూరుస్తాయి. ఉద్యోగాలు చేసేవారు కొన్ని శుభవార్తలు వింటారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. కెరీర్ లో ఏదైనా ప్లాన్ చేసుకుంటే అది నెరవేరుతుంది. మీ ప్రేమ జీవితానికి కూడా ఈ సమయం మంచి అనుకూలమైన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications