Solar eclipse 2023: ఈ రాశులవారు సూర్యగ్రహణ దోషం పీడించకుండా చెయ్యాల్సిన దానాలివే!!
నేడు సూర్య గ్రహణం. ఈ సంవత్సరం మొదటిసారి వస్తున్న ఈ సూర్యగ్రహణం అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం. సాధారణంగా గ్రహణాలు ఏవైనా అశుభసూచకంగానే భావిస్తాము. గ్రహణాలు పట్టినప్పుడు వాటి ప్రభావం ఆయా రాశుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అది వివిధ రాశుల వారి జాతకాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. అయితే సూర్య గ్రహణం కారణంగా మంచి జరిగే రాశులు, చెడు జరిగే రాశులు కూడా ఉంటాయి.
ముఖ్యంగా సూర్యగ్రహణం ప్రతికూల ఫలితాలను ఎక్కువ ఇస్తుంది. ఇక ఈ సందర్భంలో సూర్యగ్రహణ దోషం పట్టిపీడించకుండా వివిధ రాశుల వారు దానం చేయాల్సిన వివిధ వస్తువులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. సూర్యగ్రహణ దోషం పట్టిపీడించకుండా సూర్యగ్రహణం పట్టిన సమయంలో మేష రాశి వారు ఎరుపు రంగు వస్తువులను దానం చేయాలి. ఎరుపు రంగులో ఉన్న ఆహార పదార్థాలు, ఎరుపు రంగు బట్టలు, బెల్లం వంటి పదార్థాలను దానం చేయాలి.

వృషభ రాశి వారు సూర్య గ్రహణం తర్వాత తెల్లటి వస్తువులను దానం చేయాలి. తెలుపు రంగు ఉన్న ఆహార పదార్థాలు, పంచదార, అన్నం, పాలు, పెరుగు, ఖీర్ వంటి పదార్థాలను, అలాగే కర్పూరాన్ని దానం చేయాలి. తెల్లటి వస్త్రాలను కూడా దానం చేయొచ్చు. మిధున రాశి జాతకులు సూర్య గ్రహణం తర్వాత పచ్చని వస్తువులను దానం చేయాలి. ఆకుపచ్చని కూరగాయలు పచ్చిబఠానీలను దానం చేస్తే మంచిది.
సింహ రాశి వారు సూర్య గ్రహణం తర్వాత ఎరుపు రంగు లేదా నారింజ రంగు వస్తువులను, రాగి పాత్రలను దానం చేయాలి. సింహరాశి వారు బెల్లం, గోధుమలు వంటి ఆహార పదార్థాలను దానం చేయొచ్చు. కర్కాటక రాశి వారు సూర్య గ్రహణం తర్వాత తెల్లటి వస్తువులను దానం చేయాలి. అన్నం, పాలు, తెల్లని స్వీట్లు దానం చేయాలి. ముత్యాలు, తెల్లని వస్త్రాలు కూడా దానం చేస్తే మంచిది.

కన్యారాశి జాతకులు సూర్య గ్రహణం తర్వాత పచ్చి కూరగాయలను దానం చేస్తే మంచిది. సూర్యగ్రహణం తర్వాత ఆవుకు పచ్చి మేత తినిపించి, దుర్గాదేవికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పిస్తే మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications