త్వరలో అరుదైన సూర్యగ్రహణం.. ఈ రాశులవారికి ఐశ్వర్య యోగం!
ఈ సంవత్సరం తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ మాసంలో ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు రెండో సూర్యగ్రహణం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడుతోంది .అయితే ఈసారి ఏర్పడనున్న సూర్యగ్రహణం చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం లో సూర్యుడు రింగ్ ఆఫ్ ఫైర్ అంటే అగ్ని వలయం లాగా కనిపిస్తాడు.
అక్టోబర్ 2న సూర్య గ్రహణం
హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 16వ తేదీన సూర్యుడు తన రాశిని మార్చుకుని సింహరాశిని వీడి కన్య రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అక్టోబర్ 2వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెబుతున్నారు అయితే అక్టోబర్ 2వ తేదీ పితృపక్షానికి చివరి రోజు అయిన సర్వపితృ అమావాస్య కావడంతో ఈరోజుకి చాలా ప్రత్యేకత ఉందని కూడా చెబుతున్నారు.

సూర్యగ్రహణం కారణంగా ధనవంతులు అయ్యే రాశులు
అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం దక్షిణ అమెరికా అంటార్కిటికాలో సంభవిస్తుందని, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్, ఉత్తర అమెరికాలో కూడా కనిపిస్తుందని ఇది పాక్షిక గ్రహణం మాత్రమేనని చెబుతున్నారు. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించ బోదని కాబట్టి దీనికి సూతక కాలాన్ని పరిగణించరని చెబుతున్నారు. అయితే అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కొన్ని రాశులవారిని ధనవంతులను చేస్తుందని చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మేష రాశి
అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారు ఏ పని చేసినా సత్ఫలితాలను పొందుతారు. మేషరాశి జాతకుల కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మేష రాశి జాతకులకు ఈ కాలం అదృష్టకాలంగా చెప్పవచ్చు.
మిధున రాశి
అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా మిధున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో గౌరవ, మర్యాదలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది శుభ సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం.
సింహరాశి
సింహరాశి జాతకులకు అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం లబ్ధిని చేకూరుస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. నూతన గృహాలు, నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవితంలో అన్ని ఆందోళనలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు ఉంటాయి.
కన్యారాశి
కన్యా రాశి జాతకులకు అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కన్య రాశి జాతకులు ఆస్తులు, వ్యాపారాలు మొదలైన వాటిలో లాభాలను పొందుతారు. ఏ పని చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. శుభవార్తలను వింటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి ఇది సరైన సమయం. అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. అన్ని విధాలా ఇది లాభదాయకంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications