Solar eclipse2023:అక్టోబర్ లో చివరి సూర్యగ్రహణం; అదృష్ట రాశులవారు ఎవరంటే!!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలను అశుభకరమైన సంఘటనలుగా చెబుతారు. గ్రహణాలు ద్వాదశ రాశుల వారి జాతకాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది.అక్టోబర్ నెలలో 14వ తేదీన అశ్విన్ అమావాస్య రోజున చివరి సూర్యగ్రహణం సంభవిస్తుంది.
సూర్య గ్రహణం నాడు కొన్ని రాశులవారికి అదృష్టం : ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం కన్యారాశిలో, చిత్రా నక్షత్రంలో సంభవిస్తుంది. ఈ సూర్య గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు అనూహ్యమైన ఫలితాలను పొందుతారు. ఈ సూర్య గ్రహణం కొన్ని రాశి జాతకుల జీవితాలలో గణనీయమైన మార్పులకు కారణమవుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మిధున రాశి : రాబోయే సూర్యగ్రహణం మిధున రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ గ్రహణం వారికి వృత్తి రీత్యా మేలును చేకూరుస్తుంది. లాభాలను కలిగిస్తుంది. కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. పనిచేసే చోట ప్రశంసలు, గుర్తింపు మిధునరాశి వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.
సింహరాశి, తులారాశి : సింహరాశి జాతకులకు అక్టోబర్ 14వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం లాభాన్ని చేకూరుస్తుంది. వర్తక, వ్యాపారాలలో ఉన్నవారు గణనీయమైన లాభాలను గడిస్తారు. వ్యక్తిగత శత్రుత్వాలు తగ్గుముఖం పట్టవచ్చు. చివరి సూర్యగ్రహణం తులా రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు లాభాలను గడిస్తారు. వారు తమ అన్ని ప్రయత్నాలలోనూ విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది.
మకర రాశి : మకర రాశి వారికి అక్టోబర్ 14వ తేదీన ఏర్పడే చివరి సూర్యగ్రహణం ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సమయంలో వారి ఆదాయం బాగా పెరుగుతుంది. వారి ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. ఇల్లు మరియు వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి 2023 చివరి సూర్యగ్రహణం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వారు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు. వారి అదృష్టం పెరగడంతోపాటు, వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications