solar eclipse2023: గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ పనులు అస్సలు చెయ్యొద్దు!!
ఈ సంవత్సరం తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడబోతోంది. గ్రహణాలు ఏవైనా మానవ జీవితంపై ప్రభావం చూపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గ్రహణ కాలంలో వచ్చే కిరణాల వల్ల మనుషుల ఆరోగ్యం పైన కూడా ప్రభావం పడుతుంది చెబుతున్నారు. గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే మరీ ముఖ్యంగా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.
గ్రహణ సమయంలో కొన్ని పనులు గర్భిణీ స్త్రీలు చేయకూడదు. గ్రహణ కాలానికి సంబంధించిన కొన్ని నియమాలను గర్భిణీ స్త్రీల కోసం చెప్పడం జరిగింది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు రాహుకేతువులు మింగేయడం వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుని నుంచి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు వెలువడుతాయి. ఈ అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీల పై పడితే గర్భస్థ శిశువుపై ప్రభావం ఉంటుంది.

ఈ కిరణాలు పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తాయి. అందుకే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో పొరపాటున కూడా బయటకు రాకూడదు. గ్రహణం విడిచే వరకు గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని చెబుతారు. అలా ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డ పై సూర్యగ్రహణ ప్రభావం ఉండదు. సూర్యగ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు. ఒకవేళ చూస్తే దాని ప్రభావం వారి పైన కూడా ఉంటుంది.
గ్రహణ సమయంలో అంతా ప్రతికూల శక్తి మనపై ప్రభావం చూపుతుంది. ఆ సమయంలో గర్భిణీలు తినడం నిషేధించబడింది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో నిద్ర పోవడం మంచిది కాదని చెప్పబడింది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో సూదులు, కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. గ్రహణ సమయంలో వాటిని ఉపయోగించడం వల్ల కడుపులో ఉన్న బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

గ్రహణ సమయంలో పండ్లు, కూరగాయలు కట్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే పుట్టబోయే బిడ్డ గ్రహణ మొర్రితో పుట్టే అవకాశం ఉంటుంది. గ్రహణ సమయంలో బంగారు ఆభరణాలను ధరించడం, చీర పిన్నులు, హెయిర్ పిన్నులు, బిగుతు క్లిప్స్ పెట్టుకోవడం మానుకోవాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కచ్చితంగా ఈ నియమాలను పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications