Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెప్టెంబర్ లో విశేష పండుగలు.. సూర్య, చంద్ర గ్రహణాలు కూడా!

సెప్టెంబర్ మాసం. జ్యోతిషశాస్త్రంలో సెప్టెంబర్ మాసానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సెప్టెంబర్ నెల ఆధ్యాత్మికపరంగా, జ్యోతిష్య శాస్త్ర దృక్కోణ పరంగా చాలా ముఖ్యమైన నెలగా చెబుతారు. సెప్టెంబర్ మాసంలో ఋతుపవనాలు నిదానంగా ఉపసంహరించుకోవడం మొదలవుతుంది. కొద్దికొద్దిగా చలి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వాతావరణం లో మార్పులు సంభవిస్తాయి.

సెప్టెంబర్ మాసంలో పితృ పక్షాలు
సెప్టెంబర్ మాసం జ్యేష్ఠ నక్షత్రం లోని శుక్లపక్ష అష్టమి తిథిలో ప్రారంభమై పూర్వాషాడ నక్షత్రం లోని శుక్లపక్ష నవమి తిధి తో ముగుస్తుంది. సెప్టెంబర్ మాసంలో హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి సెప్టెంబర్ నెలలోనే మతపరంగా, ఆధ్యాత్మికపరంగా ముఖ్యమైనటువంటి పితృ పక్షాలు ప్రారంభమవుతాయి. పితృ పక్షం లో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి వారి ఆత్మలకు శాంతిని కలిగించడానికి తర్పణాలు వదులుతారు.

Special festivals in September Solar and lunar eclipses too

సెప్టెంబర్ లో దేవీ నవరాత్రులు
పితృపక్షం సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21వ తేదీ సర్వ పితృ అమావాస్యనాడు ముగుస్తుంది. ఇక ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. ఈ సమయంలో దానధర్మాలు చేస్తే మంచిదని చెబుతారు.సెప్టెంబర్ మాసంలోని దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి పండుగను జరుపుకుంటారు.

సెప్టెంబర్ లో ఈ రోజులు కూడా ముఖ్యమే
నవరాత్రి సమయంలో దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాయలను పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు అత్యంత భక్తిశ్రద్ధలతో దేవాలయాలలో జాగరణ మరియు భజన కీర్తనలు చేస్తారు. ఇక ఇవి మాత్రమే కాకుండా సెప్టెంబర్ మాసంలో మూడవ తేదీన పరివర్తని ఏకాదశి, సెప్టెంబరు 17వ తేదీన ఇందిరా ఏకాదశి, సెప్టెంబర్ 29వ తేదీన నవ పత్రిక పూజను నిర్వహిస్తారు.

సెప్టెంబర్ మాసంలో సూర్య, చంద్ర గ్రహణాలు
సెప్టెంబర్ మాసంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం, సెప్టెంబర్ 21వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనున్నాయి.వీటిలో చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. కనుక ఆధ్యాత్మికంగాను, జ్యోతిష్య శాస్త్ర దృక్కోణం లోను ఈ గ్రహణం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సంవత్సరం ఏర్పడే రెండవ చంద్రగ్రహణం ఇది. ఇక సెప్టెంబరు 21న ఏర్పడే సూర్యగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది.ఎన్నో విశేషాలతో, ముఖ్య పండుగలతో కూడిన సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా వివిధ సందర్భాలలో ద్వాదశ రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+