చంద్రకేతువుల సంయోగం వరమిచ్చింది వీరికి సంపదల యోగం!
గ్రహాలలో చంద్రుడిని ఏడవ గ్రహంగా పరిగణిస్తారు. సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి కృష్ణపక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడిగా ఉంటాడు. శుక్లపక్ష పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడుగా పరిగణిస్తారు. అమావాస్య నుండి కృష్ణపక్ష దశమి వరకు మధ్యమ చంద్రుడిగా చెబుతారు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు మనసుకు కారకుడు.
చంద్ర గ్రహానికి శత్రువులే లేరు
చంద్రుడుని స్త్రీ గ్రహంగా పరిగణిస్తారు. చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు అధిపతిగా ఉంటాడు. చంద్రుడు కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు. వృశ్చికంలో మూడు డిగ్రీల వరకు పరమ నీచ స్థితిలో ఉంటాడు. సూర్యుడు. బుధుడు చంద్రుడికి మిత్ర గ్రహాలు. చంద్రగ్రహానికి శత్రువులే లేరు.

నీడ గ్రహంగా కేతువు
ఇక కేతువును నీడ గ్రహంగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో కేతువు, రాహువుతో కలిసి ఒక ప్రత్యేకమైన గ్రహంగా పరిగణించబడుతుంది. కేతువు రాక్షస పాము తోకను సూచిస్తుందని చెబుతారు. కేతువు వ్యక్తి యొక్క జాతకంలో ఉన్న స్థానాన్ని బట్టి ప్రభావాన్ని చూపిస్తుంది. కేతువు రాశి చక్రంలో అపసవ్య దిశలో అంటే మేషం నుంచి మీనానికి సంచారం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క రాశిలో కేతువు 18 నెలల కాలం ఉంటుంది.
చంద్ర కేతువుల సంయోగం
సహజంగా కేతువును ప్రతికూల ప్రభావాలు కలిగించే నీడ గ్రహంగా చెబుతారు. అటువంటి కేతువు, చంద్రుల కలయిక సింహరాశిలో జరుగుతుంది. జూన్ ఒకటవ తేదీన రాత్రి 9.36 నిమిషాలకు చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. జూన్ 4వ తేదీ వరకు చంద్రుడు సింహరాశి లోనే ఉంటాడు.. చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించిన వెంటనే, సింహరాశిలో చంద్రుడు, కేతువుతో సంయోగం చెందాడు. చంద్ర, కేతువుల కలయిక వల్ల శుభాలు కలిగిన ఆ రాశులను గురించి తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి కేతు చంద్రుల కలయిక కలిసి వస్తుంది. వీరు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఈ సమయంలో వీరికి ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి లబ్ధి చేకూరుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సింహరాశిలో చంద్ర కేతువుల కలయిక వల్ల ప్రయోజనాలు కలుగుతున్నాయి. వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో డబ్బు కూడా ఆదా అవుతుంది. వీరి ప్రేమ జీవితం సంతోష దాయకంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారి కెరీర్ బాగుంటుంది.
మీన రాశి
చంద్ర కేతువుల కలయిక కారణంగా మీన రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. మీన రాశి వారు జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో వీరి ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీన రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications