ఈ రాశులవారికి చంద్రమండలం నుండి సంపదల వర్షం కురిపిస్తున్న చంద్రుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉంటుంది. గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా వివిధ శుభ యోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. ఇవి అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. నవంబర్ 22వ తేదీన కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. చంద్రుని సింహరాశిలోకి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
సింహరాశిలో చంద్రుడు
చంద్రుడు సింహరాశిలో కేవలం నవంబర్ 25వ తేదీ వరకు మాత్రమే ఉంటాడు. నవంబర్ 25వ తేదీన ఉదయం 5:52 నిమిషాల వరకు చంద్రుడు సింహరాశిలో ఉంటాడు. ఆ తర్వాత కన్య రాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. అయితే చంద్రుడి సింహరాశిలో సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

సింహరాశి
సింహరాశిలో చంద్రుని సంచారం సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సింహరాశి జాతకులు సన్నద్ధంగా ఉంటారు. ఈ సమయంలో సింహరాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పనిచేసే చోట గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ సమయంలో లాటరీల ద్వారా ఆకస్మిక డబ్బు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
సింహరాశిలో చంద్రుని సంచారం కారణంగా మూడు రోజులపాటు వృశ్చిక రాశి వారికి సంపదల వర్షం కురుస్తుంది. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఎంతోకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు వస్తాయి. మానసిక దృఢత్వం పెరుగుతుంది .పాత పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది.
ధనుస్సు రాశి
సింహరాశిలో చంద్రుని సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో కాస్త ఎమోషనల్ గా ఉంటారు. ఇదే సమయంలో సృజనాత్మకంగా కూడా ఉంటారు. ఇది ధనుస్సు రాశి వారికి మానసిక ప్రశాంతత ఇచ్చే సమయం. వీరికి ఉద్యోగాలలో ఈ సమయంలో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పాత వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications