నేటినుండి మూడు అదృష్ట యోగాలతో ఈ రాశులవారికి సంపదల వర్షం కురిపించే చంద్రుడు!

ఈనెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చంద్రుడు మిధున రాశిలో సంచరిస్తాడు. డిసెంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 20 తేదీ వరకు కర్కాటక రాశిలోనూ డిసెంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 22వ తేదీ వరకు సింహరాశిలోనూ సంచరిస్తాడు. డిసెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు కన్యారాశిలోనూ డిసెంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు తులారాశి లోను సంచరిస్తాడు.

చంద్ర గోచారంతో మూడు అదృష్ట యోగాలు
డిసెంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. ఇక డిసెంబర్ 29వ తేదీ నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తాడు. ఇక చంద్రగోచారం కారణంగా వచ్చే ఐదు రోజుల్లో మూడు అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. గజకేసరి రాజయోగం, చంద్రమంగళ యోగం, పౌర్ణమి యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ అదృష్ట యోగాల కారణంగా లబ్ది పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

The Moon will shower wealth on these zodiac signs with three lucky yogas from today

వృషభ రాశి
ఈ రాశి వారికి చంద్రసంచారం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి ఆదాయ వృద్ధి జరుగుతుంది. తల్లి తరపు నుండి సంపదలు వచ్చి పడతాయి. వృషభ రాశి వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు దూరమై మనశ్శాంతి కలుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

మిధున రాశి
చంద్రమంగళ యోగం ,పౌర్ణమియోగం, గజకేసరి యోగం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది . మిధున రాశి జాతకులకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఈ ఐదు రోజులలో శుభయోగాలు పట్టబోతున్నాయి. ఈ సమయంలో చేసిన పనులన్నీ శుభప్రదం అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగానూ లాభాలను చూస్తారు. ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇది వీరికి అదృష్ట సమయం.

కన్యారాశి
కన్యా రాశి జాతకులకు చంద్ర గోచారంతో ఏర్పడుతున్న అదృష్ట యోగాల కారణంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో సానుకూల ప్రయోజనాలను పొందుతారు. ఆదాయం డబల్ అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం గా ఉంటారు రావలసిన డబ్బు చేతికందుతుంది.

తులారాశి
తులారాశి జాతకులకు చంద్ర గోచారంతో మూడు యోగాలు ఏర్పడతాయి. తులా రాశి వారికి ఆదాయం భారీగా వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసిన విజయవంతంగా పూర్తి అవుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో తులా రాశి వారి శుభవార్తలు వింటారు.

మకర రాశి
మకర రాశి జాతకులకు చంద్ర గోచారంతో ఏర్పడే శుభయోగాలు సానుకూల ప్రయోజనాలను ఇస్తాయి. ఈ సమయంలో మకర రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారాలు చేసేవారు కూడా భారీగా డబ్బులు సంపాదిస్తారు. ఊహించని విధంగా ఆస్తి లాభం కలుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+