త్వరలో వీరికి డబ్బుల మూటలు మోసుకొస్తున్న సూర్య చంద్రులు!
వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక సూర్యచంద్రులకు ఉండే ప్రాముఖ్యత అంతా కాదు. సూర్యుడు చంద్రుడు రెండింటిని శుభగ్రహాలుగా పరిగణిస్తారు. సూర్యచంద్ర గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు ఆత్మకు బాధ్యత వహించే గ్రహం గాను, చంద్రుడు భావోద్వేగాలను నియంత్రించే గ్రహంగాను పరిగణించబడతారు.
మకర రాశిలో సూర్య చంద్రుల కలయిక
వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం జనవరి 28 వ తేదీని చాలా ప్రత్యేకమైన పవిత్రమైన రోజుగా చెబుతున్నారు. ఎందుకంటే మకర రాశిలో సూర్య చంద్రుల కలయిక ఆ రోజు ఖగోళ దృగ్విషయంగా కనిపిస్తుంది. మకర రాశిలో సూర్య చంద్రులు కలయిక కారణంగా మూడు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.

ఈ రాశులవారికి అద్భుత ఫలితాలను ఇచ్చే సూర్య చంద్రులు
జనవరి 28వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల 51 నిమిషాలకు చంద్రుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరిస్తాడు. ఇక అప్పటికే మకర రాశిలో ఉన్న సూర్యుడుతో చంద్రుడు సంయోగం చెందుతాడు. జనవరి 28వ తేదీన మకర రాశిలో సూర్య చంద్రుల కలయిక చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది.ముఖ్యంగా మూడు రాశుల వారు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు.
మేష రాశి
మకర రాశిలో సూర్య చంద్రుల కలయిక మేష రాశి వారికి అత్యంత అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మేష రాశి వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. మేష రాశి వారి ఆదాయం పెరుగుతుంది. సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి
మకర రాశిలో సూర్య చంద్రుల కలయిక వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. వృశ్చిక రాశిలో ఉన్న ఉద్యోగులు ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను పొందుతారు. ఈ సమయం వీరికి భౌతిక సుఖాలను కలిగిస్తుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. అవివాహితులకు వివాహాలవుతాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి సొంతింటి కల నెరవేరుతుంది. లగ్జరీలతో ఈ సమయంలో జీవిస్తారు.
మకర రాశి
మకర రాశి వారికి సూర్య చంద్రుల కలయిక చాలా శుభ ఫలితాలను తీసుకువస్తుంది. మకర రాశిలోనే సూర్య చంద్రులు కలవడం వల్ల మకర రాశి వారి జీవితం బాగుంటుంది. ఈ సమయంలో వీరు ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయాలంటే ఆ కల నెరవేరుతుంది. సొంత వ్యాపారాలు ఉన్నవారు ఆకస్మిక ధన ప్రయోజనాలను పొందుతారు. పనిచేసే చోట గౌరవం దక్కుతుంది. వైవాహిక జీవితంలో గతం కంటే ఎక్కువ సంతోషాలు లభిస్తాయి. ఇది మకర రాశి వారికి అన్ని విధాలుగా శుభ సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications