Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫిబ్రవరిలో కుంభరాశిలోకి సూర్యుడు.. వీరికి మాములుగా ఉండదు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ఆత్మవిశ్వాసం, పరిపాలన, తండ్రి మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు కారకుడిగా భావిస్తారు. అటువంటి సూర్య సంచారం జ్యోతిష్య శాస్త్రంలో చాలా కీలకమైనదిగా పరిగణించబడుతుంది. సూర్య సంచారం వివిధ రంగాలను ప్రభావితం చేస్తుంది. సూర్యుడు ఫిబ్రవరి 7వ తేదీన కుంభ రాశిలోకి సంచరించబోతున్నాడు.

కుంభరాశిలో సూర్య సంచారం
కుంభరాశిలో సూర్య సంచారం మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కుంభరాశిలో సూర్య సంచారం కారణంగా మూడు రాశుల వారికి కొత్త ఉద్యోగంతో పాటు, ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వీరికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

The Sun enters Aquarius in February 7th luck to these zodiac signs

మేషరాశి
సూర్యుని రాశి మార్పు మేష రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. సూర్యుడు మేష రాశి లోని ఆదాయ మరియు లాభ గృహంలోకి సంచారం చేయడం వల్ల మేష రాశి వారికి శుభ ఫలితాలు వస్తున్నాయి. మేష రాశి వారికి ఈ సమయంలో కొన్ని ఆర్థిక నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. పాత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కొత్త ఆదాయ వనరుల నుండి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి సూర్య సంచారం కారణంగా లబ్ధి చేకూరుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచారం చేసే సమయంలో మీలో ధైర్య శౌర్యాలు పెరుగుతాయి. విదేశాలలో వ్యాపారం చేసే వారికి సానుకూలంగా ఉంటుంది .ఈ సమయంలో మీ రోజువారి ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలను పొందుతారు. ఈ సమయంలో కొత్త సంబంధాలను పెంచుకుంటారు. భవిష్యత్తులో ఇది ప్రయోజనాలను చేకూరుస్తుంది. సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది.

కుంభరాశి
సూర్యుని రాశి మార్పు కుంభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. సూర్య సంచారం కుంభరాశిలో లగ్న గృహంలో జరుగుతుంది. దీనివల్ల ఈ సమయంలో మీరు గౌరవ, ప్రతిష్టలను పొందుతారు. ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. పాత వివాదాలు తొలగిపోతాయి. అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. మీ పనితీరు మెరుగుపడుతుంది.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+