2025 జనవరి నుండి వీరింటికి ధనపురాశులు దొర్లించుకుంటూ తెస్తున్న సూర్య, శుక్రులు!
వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహం ప్రత్యేకమైనదే. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తాయి. ఇక జనవరి మాసంలో కొన్ని ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితంపైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా 2025 సంవత్సరంలోని జనవరి మాసంలో జనవరి 14వ తేదీన సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. గ్రహాల రాజు అయిన సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం కొన్ని రాశుల వారికి శుభాలను తెస్తుంది.
జనవరిలో సూర్య, శుక్రుల సంచారం
ఇక జనవరి మాసంలోనే శుక్రుడు మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. జనవరి 28వ తేదీన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక సంపదలకు, విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మీనరాశి సంచారం కూడా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. జనవరి నెలలో సూర్యుడు మరియు శుక్రుడి సంచారం కారణంగా లబ్ధి పొందే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
జనవరి నెలలో సూర్యుడు మరియు శుక్రుడి సంచారం కారణంగా మేష రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. వీరి ప్రేమ జీవితం చాలా సంతోషంగా, అద్భుతంగా సాగుతుంది. పెళ్ళికాని వారికి అనుకున్న వారితో వివాహాలు జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సుఖదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు..
సింహరాశి
జనవరి నెలలో సూర్యుడు మరియు శుక్రుడి సంచారం కారణంగా సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి కూడా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.
తులారాశి
జనవరి నెలలో సూర్యుడు మరియు శుక్రుడి సంచారం కారణంగా తులా రాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలు ఉంటాయి. తులా రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఎప్పటినుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది తుల రాశి జాతకులకు శుభ సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications