ద్వాదశ రాశులవారికి చాలా ఇష్టమైన ఆహారాలు ఇవే... తెలుసుకోండి!
ప్రతి రాశి వారికి సాధారణమైన లక్షణాలు ఉంటాయి. ఇక ఇదే విషయాన్ని వేద జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతుంది. మొత్తం ద్వాదశ రాశులవారికి ఆయా రాశులను బట్టి వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా వారి ఆహారపు అలవాట్లు కూడా ఉంటాయి. 12 రాశులవారు వారి రాశిని బట్టి కొన్ని రకాల ఆహారాలను ఇష్టపడతారు. ప్రస్తుతం మనం ఏ రాశి వారికి ఎటువంటి ఆహారం ఇష్టంగా ఉంటుందో తెలుసుకుందాం.
మేష, వృషభ రాశి వారికి ఇష్టమైన ఆహారాలు
మేషరాశి నుండి మీనరాశి వరకు మొత్తం 12 రాశుల వారికి వివిధ రకాల ఆహారాలు ఇష్టమైన ఆహారాలుగా ఉంటాయి. మేష రాశి వారికి కారంగా ఉండే వంటకాలు, గుడ్లు, సీడ్స్, గింజ ధాన్యాలు ఇష్టమైన ఆహారాలుగా చెబుతారు. వృషభ రాశి వారికి పాలు, నట్స్ ,పండ్లు, మిల్క్ షేక్ లు చాలా ఇష్టమైన ఆహారాలు గా చెబుతారు. వీరు మృదువుగానూ, రుచికరంగా ఉండే ఆహారాలను ఇష్టపడతారు.

మిధున, కర్కాటక రాశి వారు వీటిని ఇష్టంగా తింటారు
మిధున రాశి వారు సలాడ్లు, పండ్లతో పాటు తేలికైన డిప్రెషింగ్ గా ఉండే ఆహారాలను తింటారు. మీరు వైవిధ్యమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. కర్కాటక రాశి వారు ఇంటి వంటకాలను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. సామూహిక భోజనాలు, మృదువైన ఆహారాలు, పాలు, పండ్లు వంటి వాటినితీసుకోవడానికి కర్కాటక రాశి వారు ఎక్కువగా ఇష్టపడతారు .
సింహ, కన్యా, తులా రాశివారికి ఇష్టమైన ఆహారాలివే
సింహరాశి వారు కాల్చిన మాంసం, కారంగా ఉండే వంటకాలు తదితర రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. మీరు ఎప్పటికప్పుడు కొత్త రుచులను కోరుకుంటారు.
కన్యారాశి వారు కూరగాయలు, పండ్లు, నట్స్ తో పాటు, మసాలాలతో తయారు చేసే ఆహారాన్ని, సమతుల్యమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. తులారాశి వారు విభిన్న రుచులతో ఉండే ఆహారాలను టేస్ట్ చేయడానికి ఇష్టపడతారు. రుచికరమైన సమతుల్యమైన ఆహారాన్ని, సలాడ్లు, పండ్లు వంటి వాటిని తినడానికి ఇష్టపడతారు.
వృశ్చిక, ధనుస్సు రాశులవారికి ఇవే ఇష్టం
వృశ్చిక రాశి వారు చల్లగా ఉండే ఆహారాలను, ప్రేమతో ఉండే ఆహారాలను తినడానికి ఇష్టపడతారు. డ్రై గా ఉండే ఫుడ్స్ ను ఇష్టపడరు. పుచ్చకాయ, ద్రాక్ష, లెట్యూస్, దోసకాయలు వంటి వాటిని తినడానికి ఇష్టపడతారు.ధనుస్సు రాశి వారు వేడిగా ఉండే ఆహారాలను తినడానికి ఇష్టపడతారు. కారంగా ఉండే వంటకాలు, మాంసాహారం అధికంగా ఉండే ఆహారాలను, శరీరాన్ని ఉత్తేజపరిచే ఆహారాలను తినడానికి ఇష్టపడతారు.
మకర, కుంభ, మీన రాశులవారికి ఇష్టమైన ఆహారాలు
మకర రాశి వారు సాంప్రదాయ వంటకాలను తినడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మంచి రుచులను కోరుకుంటారు. మాంసం, నట్స్ వంటి వాటిని తినడానికి ఇష్టపడతారు.కుంభ రాశి వారు వినూత్నమైన ఆహారాలను, విభిన్నమైన రుచులను తినడానికి ఇష్టపడతారు. పండ్లు, కూరగాయలు ,సలాడ్లు తినడం వీరికి ఎక్కువ ఇష్టం. మీన రాశి వారు రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. కొత్త కొత్త వెరైటీ ఫుడ్ లను టేస్ట్ చేయాలని భావిస్తారు. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తింటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications