పొద్దున లేస్తే మొగుడుపెళ్ళాల కీచులాట.. కారణాలివే కావచ్చు, ఇలా చెయ్యండి!
భార్యాభర్తలు సంతోషంగా జీవించాలని భావిస్తారు. ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలని, వైవాహిక జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటారు. అయితే కొందరి జీవితాల్లో ఊహించని చిరాకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి అసలే పొసగదు. చిన్న చిన్న విషయాలకి తరచూ గొడవలతో భార్యాభర్తలు అనేక ఇబ్బందులు పడతారు. ఇక వైవాహిక జీవితంలో ఎప్పుడు భార్యాభర్తలు కీచులాడుకుంటున్నారు అంటే ఆ ఇంట్లో కచ్చితంగా వాస్తు దోషాలు ఉండి ఉండాలి.
వాస్తు సరిగా లేకుంటేనే కీచులాటలు
ముఖ్యంగా పడకగదిలో వాస్తు సరిగా లేకపోతే మొగుడు పెళ్ళాల మధ్య కీచులాటలు తరచూ జరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.పడక గది వాస్తు సరిగా లేకపోతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. మనకు తెలిసి తెలియక పెట్టే కొన్ని వస్తువులు మనలను అనవసరపు ఇబ్బందులకు గురిచేస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల దాంపత్య జీవితానికి అవరోధంగా మారుతాయి.

పడకగది ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు
ముఖ్యంగా పడక గదిలో భారీగా ఫర్నిచర్ ఉంటే అది భార్యాభర్తల మధ్య గొడవకు, అందులోనూ ముదురు రంగు ఫర్నిచర్ ఉంటే అది కూడా ప్రతికూలతల కు కారణమవుతుంది. పడక గదిలోకి గాలి, వెలుతురు ధారాళంగా రావాలి. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. గదిలో ఉన్న కిటికీలను పూర్తిగా మూసివేసి ఏసీ లకు అలవాటు పడ్డాం. అయితే ఈ అలవాటు మంచిది కాదు.
మంచాల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పడకగదిలో ఉన్న కిటికీలు తీసి ఎప్పుడూ సానుకూల శక్తిని ఇంట్లోకి ఆహ్వానించాలి. అంతేకాదు పడక గదిలో ఉన్న మంచాలను తయారు చేయించేటప్పుడు చెక్క విషయంలో జాగ్రత్త వహించాలి. రోజ్ వుడ్, గంధపుచెక్క, అశోక, టేకు, వేప చెక్కతో చేసిన ఫర్నిచర్ ను మాత్రమే పడకగదిలో వినియోగించాలి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్యన సంబంధాలలో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.
భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పోవాలంటే ఇలా చెయ్యండి
ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటే పడక గదిలో ఉండే వాస్తు దోషాలను సవరించడానికి ఆ గదిలో తాజా పువ్వులను పెడితే సానుకూలత వ్యాపిస్తుంది. అంతేకాదు పడక గదిలో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి గదిని తుడిచే సమయంలో ఉప్పు నీటితో శుభ్రం చేస్తే మంచిది.
ఈ వాస్తు జాగ్రత్తలతో భార్యాభర్తల గొడవలకు చెక్
గది ఎప్పుడు శుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవడం, గది గోడలకు లేత రంగులు వేయడం వంటివి చేస్తే మొగుడు పెళ్లాల మధ్య పంచాయితీలు రాకుండా ఉంటాయి. వాస్తుకు సంబంధించినటువంటి ఈ నియమాలను పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలకు కొంతమేర ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications