రాహు కేతువులు మిమ్మల్ని పీడిస్తున్నారనే సంకేతాలు ఇవే!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతువులను ప్రధాన గ్రహాలుగా పరిగణించనప్పటికీ వీటిని చాయాగ్రహాలుగా పరిగణించినప్పటికీ ఇవి అశుభ ఫలితాలనే ఎక్కువ ఇస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండు గ్రహాలను చాలా క్రూరమైన మరియు పాపగ్రహాలుగా చెబుతారు. ప్రజల జీవితాలపైన రాహుకేతువులు ఒకే విధమైన ప్రభావాలను చూపిస్తారు. ముఖ్యంగా వ్యక్తి యొక్క జాతకంలో రాహు కేతువుల యొక్క దుష్ప్రభావాలు ఉంటే వారి భావోద్వేగాల పైన ముఖ్యంగా లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి.
రాహుకేతువులు అశుభ స్థానాల్లో ఉంటే రాహుకేతువుల ప్రభావమే
జాతకంలో రాహు కేతువులు అశుభ స్థానాలలో ఉంటే మనకు అనేక సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాల ఆధారంగా రాహు కేతువులకు సంబంధించిన పరిహారాలు చేస్తే మన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అసలు రాహు కేతువులు మన జాతకంలో దుష్ప్రభావాలను చూపిస్తున్నారు అని చెప్పే సంకేతాలు ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

రాహువు దుష్ప్రభావ సంకేతాలివే
మన జాతకంలో రాహు కేతువులు దుష్ప్రభావాల సంకేతాలను పరిశీలిస్తే ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువు లేదా పక్షి చనిపోతే రాహువు దుష్ప్రభావం మీపై ఉన్నట్టుగా సంకేతం. అంతేకాదు బల్లి మీ ఇంట్లో తరచుగా మీకు కనిపిస్తుంటే లేదా చనిపోయిన పాము మీకు తరచుగా కనిపిస్తే మీపై రాహువు ప్రభావం ఉన్నట్టు సంకేతం.
మోసాలు, ద్రోహాలు రాహుకేతువుల ప్రభావానికి సంకేతం
విపరీతంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతున్నట్టు అనిపిస్తే, సన్నిహితులలో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే మీ జాతకంలో రాహువు ప్రతికూల ప్రభావాలను సూచిస్తుందని సంకేతం. అకస్మాత్తుగా మీ తలపై బల్లిపడిన, భుజంపై బల్లి పడిన అది రాహువు యొక్క దుష్ప్రభావానికి సంకేతం. బంధువుల ద్వారా జరిగే ద్రోహాలు, ఇంట్లో పిల్లి ఏడుస్తున్న శబ్దాలు రాహువు యొక్క దుష్ప్రభావాలను సూచిస్తాయి.
కీళ్ళ నొప్పులు, కుటుంబంలో గొడవలు
వినికిడి లోపం వచ్చిన శరీరంలోని కీళ్లలో ఆకస్మిక నొప్పులు రావడం జరిగిన రాహు కేతువుల అననుకూల ప్రభావాలకు ఇది సంకేతం. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరిగి కుటుంబంలో విభేదాలు ఏర్పడితే అది కూడా రాహుకేతువుల దుష్ప్రభావానికి సంకేతం. అకస్మాత్తుగా తలలో వెంట్రుకలు రాలడం జరిగితే, గోర్లు విరిగిపోతే రాహు కేతువులు అశుభసంస్థానంలో ఉన్నారనడానికి సంకేతం.
రాహు కేతువుల దుష్ప్రభావాలతో జాగ్రత్త
మీ పిల్లలు మీ మాట వినకుండా వ్యతిరేకిస్తే, పక్కింటి వాళ్ళు మీతో గొడవలు పడితే ఇది కేతువు యొక్క ప్రతికూల ప్రభావానికి సంకేతం. కాబట్టి జాతకంలో రాహుకేతువుల దుష్ప్రభావాలను జాగ్రత్తగా గమనించి తదనుగుణంగా ఆ దుష్ప్రభావాలనుంచి ఉపశమనం పొందే చర్యలు చేస్తే తప్పనిసరిగా సమస్యల నుంచి బయటపడతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications