అరుదైన ద్వి పుష్కర యోగంతో నేటినుండి నక్కతోక తొక్కే రాశులు ఇవే!

వేద జ్యోతిష్య శాస్త్రంలో అరుదైన జ్యోతిష్య అమరికలు కూడా చోటుచేసుకుంటాయి. ఈరోజు ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం విజయాన్ని, ఆనందాన్ని, శ్రేయస్సునీ విస్తరించేందుకు దోహదం చేస్తుంది. తిధి చంద్ర దినంగా, వారం మరియు నక్షత్రం యొక్క నిర్దిష్ట పరిస్థితులలో నిర్దిష్ట గ్రహాల అమరికలు కలిసినప్పుడు ద్వి పుష్కరయోగం ఏర్పడుతుంది.

అద్భుతమైన ద్వి పుష్కర యోగం
భద్ర తిధి అంటే రెండవ మరియు ఏడవ లేదా 12వ చంద్ర దినం, ఆది, మంగళవారాలు లేదా శనివారాలలో వచ్చి మృగశిర, చిత్త లేదా ధనిష్ట వంటి ద్విపద నక్షత్రాలలో కలిస్తే ద్వి పుష్కర యోగం ఏర్పడుతుంది. నేడు ఏర్పడిన ఈ ద్వి పుష్కర యోగంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

These are the zodiac signs that will shine from today with a rare DwiPushkar Yoga

వృషభ రాశి
వృషభ రాశి వారికి ద్వి పుష్కర యోగం ప్రభావంతో ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టే వారికి ఇప్పుడు అనుకూలమైన సమయం. కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు చాలా బాగుంటాయి. ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతారు. విజయానికి భావోద్వేగ మద్దతును అందించే సమయం ఇది. అయితే ఈరోజు ముఖ్యమైన ఒప్పందాలను ఖరారు చేయడానికి కొత్త వెంచర్లను ప్రారంభించడానికి అద్భుతమైన రోజు.

సింహరాశి
ద్వి పుష్కర యోగంతో సింహ రాశి వారికి అదృష్టం బాగుంటుంది. సింహరాశి జాతకుల కెరీర్లో పురోగతి ఉంటుంది. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈ సమయంలో శుభవార్తలు వింటారు. నమ్మకంగా ఉండడం లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయడం చేస్తే సింహ రాశి వారు సక్సెస్ అవుతారు.

తులారాశి
తులారాశి వారికి ద్వి పుష్కర యోగంతో ఆర్థిక లాభాల కోసం అవకాశాలు కనిపిస్తాయి. వ్యక్తిగత జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. పెండింగ్లో ఉన్న పనులు పరిష్కరించబడతాయి. ఈ సమయంలో గరిష్ట విజయాల కోసం భాగస్వామ్యాల పైన దృష్టి పెడితే మంచిది.

ధనుస్సు రాశి
ద్వి పుష్కర యోగంతో ధనుస్సు రాశి వారికి సానుకూలత, అదృష్టం కలిసొస్తుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి కెరీర్ లో ముందుకు వెళ్లాలనుకునే వారికి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఇది అద్భుతమైన సమయం. ఇది ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇచ్చే సమయం ఏ ప్రాజెక్ట్ లో అయినా విజయం సాధించే సమయం. ఇప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ మనసు చెప్పింది విని తీసుకుంటే మంచి జరుగుతుంది.

మీనరాశి
ద్వి పుష్కర యోగంతో మీన రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరమైన జీవితంలోనూ ఒక స్పష్టత వస్తుంది. ఆర్థిక అవకాశాలు మెరుగ్గా కనిపిస్తాయి. సృజనాత్మకత పెరుగుతుంది. ప్రభావవంతమైన వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇది మీన రాశి వారికి అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+