ఈ రాశులవారిని మే నెలలో నిప్పుల మీద నడిపిస్తా అంటున్న బృహస్పతి!
జ్యోతిష్య శాస్త్రంలో గురువుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దేవతల గురువుగా భావించే బృహస్పతి శుభగ్రహంగా పరిగణించబడుతుంది. మే 25వ తేదీన వృషభరాశి నుంచి మిధునరాశికి బృహస్పతి సంచారం సాగుతుంది. 12 నెలల పాటు బృహస్పతి మిధున రాశిలో సంచారం చేస్తారు. బృహస్పతి మిధునరాశిలో సంచారంతో కొన్ని రాశులవారికి ధనయోగం, అధికార యోగం వస్తుంది. బృహస్పతి నీచ స్థానంలో ఉన్నప్పుడు కష్టాలను అనుభవించే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి లో బృహస్పతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల మీరు శ్రమకు తగిన ఫలితం పొందలేరు. ఇతరుల నుండి ఇబ్బందులు వస్తాయి. ఆదాయం తగ్గిపోతుంది. ప్రయాణాలు కూడా నష్టం కలిగిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో ప్రతికూలతలు వస్తాయి. ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది.

మిధున రాశి
మిధున రాశిలో గురువు సంచారం ఇబ్బందిని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఉద్యోగంలో ఎంత కష్టపడినా గుర్తింపు రాదు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ జీవితం అసంతృప్తిగా మారుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో 12వ స్థానంలో గురువు సంచరించడం వల్ల కర్కాటక రాశి వారి ఖర్చులు పెరుగుతాయి. వృధా ఖర్చులు అవుతాయి. కుటుంబ సంబంధాలలో చిరాకులు వస్తాయి. శుభకార్యాలు వాయిదా పడతాయి. ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి.
కన్యారాశి
కన్యారాశిలో గురువు దశమ స్థానంలో ప్రవేశించడం కారణంగా వీరు ఇబ్బందులు పడతారు. ఉన్నతాధికారుల నుండి సమస్యలు ఎదుర్కొంటారు. వర్తక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాలు నష్టపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో గురువు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల వీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రావలసిన డబ్బు అందదు. మిత్రుల వల్ల మోసపోతారు. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలతో ఆర్థికంగా భారం పెరుగుతుంది. ఆదాయ వృద్ధి ఆలస్యం అవుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి ఆరవ స్థానంలో గురువు ప్రవేశించడం కారణంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక నష్టాలు, మోసాలు పెరిగే అవకాశం ఉంది. గృహ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. కుటుంబ సంబంధాలలో వివాదాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications