2025 ఆరంభమే శుభయోగం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి సంవత్సరం వివిధ గ్రహాలు నిర్దిష్ట కాలంలో సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జాతకాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇక త్వరలో 2025వ సంవత్సర రాబోతోంది. ఈ 2025 సంవత్సరం ఈసారి పలు శుభసంకేతాలతో ప్రారంభం అవుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి.
2025 ఆరంభంలోనే శుభయోగం
2025 జనవరి 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుస్సు రాశిలో బుధ సూర్యులు కలవనున్నారు. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా అనేక రాశుల వారికి పలు శుభపరిణామాలు ఏర్పడబోతున్నాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
జనవరి నెలలో ఏర్పడే మొట్టమొదటి బుధాదిత్య రాజయోగం కారణంగా మేషరాశి జాతకులు లబ్ధి పొందుతున్నారు. మేషరాశి వారికి భాగ్యస్థానంలో రవి బుధ గ్రహాల సంయోగం జరుగుతుంది. దీని కారణంగా మేషరాశి జాతకులు పురోగతి సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇది మేషరాశి వారికి శుభ సమయం.
మిధున రాశి
ఈ రాశికి అధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్న రవితో కలవడం వల్ల మిధున రాశి జాతకులకు కూడా ఈ సమయంలో లబ్ధి చేకూరుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ప్రభుత్వ ఒప్పందాలు చేసుకున్న వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగం చేసే విషయంలో కూడా వీరు సానుకూలతలను చూస్తారు.
సింహరాశి
ఈ రాశి వారికి పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా సింహ రాశి వారికి ఆర్థికపరంగా లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వర్తక వ్యాపారాలలో పురోగతి చోటు చేసుకుంటుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ధనస్థానంలో రవి బుధ గ్రహాల కలయిక జరుగుతుంది. దీని కారణంగా వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వృశ్చిక రాశి వారి ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సురాశిలోనే బుధ రవి గ్రహాలు కలయిక జరగడం వల్ల ఈ రాశి వారికి బుధాదిత్య రాజయోగం లబ్ధి చేకూరుస్తుంది. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. సంతాన లాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ధనుస్సు రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
కుంభరాశి
కుంభ రాశి వారికి లాభ స్థానంలో బుధ సూర్య గ్రహాల కలయిక జరగడం వల్ల వీరికి కలిసి వస్తుంది. ఆర్థికంగా భారీ ప్రయోజనాలు చేకూరుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక తీరుతుంది. ఉద్యోగాలు చేసేవారు ఉన్నత స్థానాలకు వెళతారు. ఆస్తి సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇది కుంభ రాశి వారికి శుభాలను చేకూర్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications