డిసెంబర్ లో వీరే మహర్జాతకులు.. నా మాటే శాసనమన్న శని!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులు, నక్షత్ర సంచారాలు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని కీలక గ్రహంగా పరిగణిస్తారు. శని గ్రహం ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తుంది అంతేకాదు ప్రస్తుతం శని శతభిషా నక్షత్రంలో సంచారం సాగిస్తున్నాడు. న్యాయదేవుడు, కర్మ ఫలితాలను ఇచ్చే దేవుడు అయిన శని అక్టోబర్ నెలలో శని సరిగ్గా సూర్యగ్రహణం రోజున రాహువు కు చెందిన నక్షత్రంలో సంచారం మొదలు పెట్టాడు . డిసెంబర్ 27వ తేదీ వరకు శతభిషా నక్షత్రంలోనే సంచరిస్తాడు . దీంతో శని నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.
మేషరాశి
శని నక్షత్ర సంచారం కారణంగా మేష రాశి జాతకులు మంచి ప్రయోజనాలను పొందుతారు . ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. మేషరాశి జాతకులు ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. డబ్బు సంపాదించడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ఇది మేషరాశి వారికి మంచి సమయం.

మిధున రాశి
డిసెంబర్ నెలలో శని నక్షత్ర సంచారం కారణంగా మిధున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది . అన్ని విధాలుగా మిధున రాశి వారికి ఈ సమయం శుభ సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఏవైనా కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు ఈ సమయంలో మెరుగ్గా ఉంటాయి.
సింహరాశి
డిసెంబర్ నెలలో శతభిషా నక్షత్రంలోకి శనిసంచారం కారణంగా సింహరాశి జాతకులు శుభ వార్తలు వింటారు. ఈ కాలం సింహ రాశి వారికి సానుకూల కాలం. సింహరాశి జాతకులు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఏ పని చేసినా సరే విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్ధికంగా ఈ సమయం లాభిస్తుంది.
కన్యారాశి
శని నక్షత్ర సంచారం కారణంగా కన్యారాశి వారికి ఆర్దింగా కలిసి వస్తుంది. కన్య రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయం అన్ని విధాలుగా శుభప్రదం. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది.
తుల రాశి
డిసెంబర్ నెలలో శని నక్షత్ర సంచారం కారణంగా తులా రాశి జాతకులకు అంతా శుభమే జరుగుతుంది. ఈ సమయం మీకు ఆర్ధిక పురోగతిని ఇస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ సమయంలో కష్టపడి చేసే ఏ పనైనా సత్ఫలితాలను ఇస్తుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో తమపై ఉన్న ఉన్నత ఉద్యోగుల నుండి మన్ననలు పొందుతారు.
మకర రాశి
మకర రాశి జాతకులకు శని నక్షత్ర సంచారం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. మకర రాశి జాతకులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి.
కుంభరాశి
డిసెంబర్ నెలలో శని నక్షత్ర సంచారం కారణంగా కుంభరాశి జాతకుల పంట పండుతుంది. కుంభ రాశి వారికి ఈ సమయం అదృష్ట సమయం. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా ఉంటుంది. ఈ సమయంలో కుంభ రాశి వారికి డబ్బుకు లోటుండదు. కుంభ రాశి జాతకులకు ఈ సమయంలో ఏ పని చేసినా శని దయతో అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం అనుకూలం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications