నేడే ఆయుష్మాన్ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం ఆరంభం!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేడు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం కూడా ఉంటుంది. ఈ సమయంలో ఆయుష్మాన్ యోగం, ప్రీతి యోగం ఏర్పడుతున్నాయి. ఈ ఆయుష్మాన్ యోగం వలన ఆరు రాశుల వారికి నేటి నుండి అదృష్టం వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మరి ఆ ఐదు రాశుల వివరాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఆయుష్మాన్ యోగం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈ సమయంలో ఏ పని అనుకున్నా ఆ పనిలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో వృషభ రాశి వారిలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. కుటుంబంలో గౌరవాన్ని పొందుతారు. పని చేసే దగ్గర మీ గౌరవం ఈ సమయంలో బాగా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ సమయం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వ్యాపారాలు చేసే వారికి లాభసాటిగా ఉంటుంది.

మిధున రాశి:
మిధున రాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం వస్తుంది. మీరు ఈ సమయంలో అద్భుతమైన వార్తలను వింటారు. ఆస్తి పరంగాను ఈ వారం వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా కొనుగోలు చేయాలన్న, , విక్రయించాలని భావించిన ఇదే సరైన సమయం. మీ ప్రయాణాలు చాలా సుఖవంతంగా సాగుతాయి. పనిలో మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం ఎప్పటికీ దక్కుతుంది.
సింహరాశి:
సింహ రాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. సింహ రాశి వారికి ఈ సమయంలో ఆస్తి పరంగాను ఈ వారం వీరికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఏదైనా కొనుగోలు చేయాలన్న, విక్రయించాలని భావించిన ఇదే సరైన సమయం. సింహరాశి వారి ప్రయాణాలు చాలా సుఖవంతంగా సాగుతాయి. పనిలో మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం ఎప్పటికీ దక్కుతుంది.
తులారాశి:
తులారాశి వారికి ఆయుష్మాన్ యోగం వల్ల అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఏవైనా మార్పులు చేర్పులు కావాలంటే ఈ సమయంలో చేస్తే మంచిది. ఈవారం ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లవలసి వస్తే దానిలో కూడా విజయాన్ని సాధిస్తారు.తులారాశి వారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు.
కన్యా రాశి :
కన్యా రాశి వారికి ఆయుష్మాన్ యోగం వల్ల లబ్ది జరుగుతుంది. ఈ సమయంలో మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మతపరమైన పవిత్రమైన కార్యక్రమాలలో ఈ సమయంలో పాల్గొంటారు. విదేశాలలో ఏదైనా ఉద్యోగాలు చెయ్యాలని భావిస్తే ఈ సమయం సరైన సమయం.
మీన రాశి:
ఈ వారం మీన రాశి వారికి ఆయుష్మాన్ యోగం వల్ల సంతోషం కలుగుతుంది. కుటుంబసభ్యుల సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారం కోసం సాగించే ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. విదేశాలలో వ్యాపారం చేయాలనుకునే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. మీ సామాజిక స్థితి మెరుగుపడుతుంది. ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. కెరీర్ లోనూ మెరుగైన ప్రయోజనాలను పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications