today rashiphalalu: నేడు వీరికి డబ్బులే డబ్బులు.. వరమిచ్చిన బుధ కేతువులు!
ఫిబ్రవరి 6, 2026 శుక్రవారం నాడు ముఖ్యమైన గ్రహ సంచారాలు జరుగుతున్నాయి. ఈ రోజున శుక్రుడు కుంభ రాశిలో సంచరిస్తుండగా, గురుడు మిథున రాశిలో ఉన్నాడు. అలాగే బుధ-కేతు సంయోగ ప్రభావం కూడా కొన్ని రాశులపైన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహస్థితుల కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో అన్ని 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందో చూద్దాం.
మేష రాశి:
మేషరాశి జాతకులు ఈ రోజు ఆర్థిక విషయాల్లో మెల్లగా పురోగతి కనిపిస్తుంది. వీరికి మిత్రుల సహకారం లభిస్తుంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగ విషయాల్లో ఓర్పు అవసరం.

వృషభ రాశి:
నేడు వృషభ రాశి జాతకులకు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. పై అధికారులతో సంభాషణలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో శుభకార్యాలు, చర్చలు జరిగే అవకాశం ఉంది.
మిథున రాశి:
నేడు గురుడి అనుగ్రహంతో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. చదువు, పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త అవకాశాలు రావచ్చు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి జాతకులు నేడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రుణాలు, అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
సింహ రాశి:
సింహరాశి జాతకులకు భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. కీలక నిర్ణయాల్లో తొందరపడకుండా ఉంటే మంచిది.
కన్య రాశి:
కన్యా రాశి జాతకులకు ఉద్యోగ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో మాటల్లో వివాదాలు రాకుండా చూసుకోవాలి. కన్యారాశి వారి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
తుల రాశి:
తులారాశి వారికి ప్రేమ, వివాహ విషయాల్లో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. నేడు వీరికి ఆర్థికంగా లాభదాయకమైన రోజు.
వృశ్చిక రాశి:
నేడు వృశ్చిక రాశి వారికి ఇంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. భూమి, వాహనాల కొనుగోలు నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు నేడు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వీరికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
మకర రాశి:
మకర రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో సమయం గడపడంతో మానసిక ప్రశాంతత ఇస్తుంది.
కుంభ రాశి:
కుంభరాశి వారు శుక్రుడి ప్రభావంతో ఆకర్షణ పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. సామాజిక గుర్తింపు లభిస్తుంది.
మీన రాశి:
మీనరాశి వారికి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications