today rashiphalalu: నేడు శివయోగంతో ఈ రాశులవారిపై సంపదల వెల్లువ
నేడు మే 4వ తేదీ 2026వ సంవత్సరం. నేడు గ్రహాల సంచారం కారణంగా జీవితాలలో ప్రభావం కనిపిస్తుంది. గ్రహాలు వివిధ రాశులలో సంచరిస్తూ అన్ని రాశుల వారి జీవితం పైన తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నేడు శివయోగం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి
మేషరాశి జాతకులకు నేడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. బంధువులతో వాగ్వాదాలు, అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మంచి ఫలితాల కోసం గణపతి స్తోత్రం పఠించడం మంచిది.

వృషభ రాశి
వృషభ రాశి మీ రంగాల్లో ఆశించిన విషయాలు సాధించగలరు. బంధువుల నుంచి సహాయం, సహకారం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో అస్థిరత చూపకండి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. నేడు మంచి ఫలితాల కోసం సూర్య ధ్యానం శుభప్రదం.
మిధున రాశి
మిధున రాశి జాతకులు నేడు మనోబలంతో కార్యాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. సరైన ఆలోచనతో అనుకున్నది సాధిస్తారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. కీర్తి-ప్రతిష్టలు పెరుగుతాయి. వీరికి నేడు గణపతి ఆరాధన మంచి ఫలితాలిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు ప్రారంభించిన పనుల్లో అడ్డంకులు రాకుండా ముందుచూపుతో ముందుకు సాగాలి. సమయం, పరిస్థితులను బట్టి నడుచుకోవాలి. కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. వీరికి నేడు లక్ష్మీ గణపతి ధ్యానం శుభప్రదం.
సింహరాశి
నేడు సింహ రాశి జాతకులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అడ్డంకులు ఎదుర్కొనకుండా జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలి. కీలక పనులు పూర్తి చేయగలరు. మంచి ఫలితాల కోసం లక్ష్మీ గణపతి స్తోత్రం పారాయణ చేయడం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు దక్కుతాయి. సన్నిహితుల ద్వారా మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మనస్సు చెప్పినట్టు నడుచుకోండి. ఇప్పటివరకు చేసిన శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు వీరికి గణపతి ఆరాధన శుభ ఫలాలనిస్తుంది.
తులారాశి
తులా రాశి జాతకులు భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టులతో సమయం గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు సఫలం అవుతాయి. ఓర్పు కొనసాగించాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వినాయక దర్శనం మంచి ఫలితాలిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి అదృష్టం మీ వైపు ఉంటుంది. అధికారులు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కీలక వ్యవహారాలు సాఫీగా ముగుస్తాయి. ఎక్కువ శ్రమ పడకుండా చూసుకోండి. నేడు వీరికి శివపార్వతుల దర్శనం శుభప్రదం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు ఉద్యోగంలో అలసట పెరగకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. సందర్భానికి తగ్గట్టు ముందుకు సాగండి. పెద్దల అనుభవ సూచనలు ఉపయోగపడతాయి. వీరికి నేడు గణపతి ధ్యానం మేలు చేస్తుంది.
మకర రాశి
మకర రాశి జాతకులు నేడు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో లాభాలు ఉంటాయి. వీరు లక్ష్మీ స్తోత్రం చదవడం మంచిది.
కుంభ రాశి
కుంభరాశి వారికి మీ రంగాల్లో విజయాలు కొనసాగుతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ అంచనాలు నెరవేరతాయి. నేడు గణపతి ధ్యానం మంచి ఫలితాలిస్తుంది.
మీనరాశి
మీనరాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలు దక్కుతాయి. మనోబలంతో చేసే పనులు శక్తినిస్తాయి. పై అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థిక లాభం ఉంది. ధర్మ సిద్ధి కలుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. గణపతి ద్వాదశ నామాలు పఠించడం శుభకరం.
గమనిక: ఇవి సాధారణ రాశి ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం ప్రకారం ఫలితాలు మారవచ్చు.













Click it and Unblock the Notifications