today rashiphalau: నేడు వీరికి బుధాదిత్యుల కారణంగా లాటరీ ఖాయం!
ఫిబ్రవరి 21, 2026న గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశులవారి జీవితాలపై ప్రభావం పడుతుంది. నేడు సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తుండగా గురుడు వృషభరాశిలో ఉన్నాడు. బుధుడు కుంభంలోనూ, కుజుడు మిథునంలోనూ, శని మీనరాశిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి.
ముఖ్యగ్రహాల సంచారంతో లబ్ది
చంద్రుడి స్థానం భావోద్వేగాలపై ప్రభావం చూపుతుంది. ఈ రోజు గ్రహ స్థితులు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబ జీవితంపై ప్రభావం చూపనున్నాయి. నేడు వీరికి అన్ని విధాలా శుభ ఫలితాలు వస్తాయి. నేడు ముఖ్యగ్రహాల సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశులేమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి నేడు కొత్త పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల విషయంలో సహనం పాటించాలి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి నేడు మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది.
మిధున రాశి
మిథున రాశి వారికి నేడు పనుల్లో ఒత్తిడి ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నేడు మిత్రుల సహకారం లభిస్తుంది. ప్రయాణ సూచనలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు.
సింహ రాశి
సింహ రాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాల్లో పురోగతి ఉంటుంది. ఉన్నతాధికారులతో చర్చలు సానుకూలంగా సాగుతాయి.
కన్యా రాశి
కన్య రాశి జాతకులకు కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీ సంబంధిత విషయాలు అనుకూలంగా మారుతాయి.
తులా రాశి
తుల రాశి వారికి నేడు ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. నేడు వీరికి శుభ దినం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు నేడు ముఖ్య నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి నేడు దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది.
మకర రాశి
మకర రాశి వారికి నేడు పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. సహచరులతో సహనం అవసరం.
కుంభ రాశి
నేడు కుంభ రాశి వారికి సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులకు ఇది అనుకూల సమయం. కొత్త కార్యక్రమాలు ప్రారంభించవచ్చు.
మీన రాశి
మీన రాశి వారికి నేడు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా అనిపించవచ్చు. ఆర్థిక నియంత్రణ అవసరం.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.












Click it and Unblock the Notifications