today rashiphalalu.. నేడు ఈ రాశులవారికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది!
వేద జ్యోతిషశాస్త్రంలో 2026 జనవరి రెండవ తేదీ గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫిబ్రవరి 2, 2026 నాటి గ్రహాల సంచారం ప్రకారం సూర్యుడు, మరియు బుధుడు మకర రాశిలో సంచరిస్తుండగా, చంద్రుడు సింహ రాశిలో ఉన్నాడు. శుక్రుడు ధనుస్సులో, కుజుడు వృషభంలో సంచారం చేస్తున్నారు. గురువు మిథునంలో, శని మరియు రాహు మీన రాశిలో, కేతు కన్య రాశిలో సంచారం చేస్తున్నారు.
మేషరాశి
మేష రాశివారికి నేడు సానుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా అనుకూలమైన రోజు. కొత్త బాధ్యతలు వచ్చినా సమర్థంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా లాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం మెరుగుపడుతుంది.

వృషభ రాశి
వృషభ రాశివారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
మిధున రాశి
మిథున రాశివారికి గురు బలం వల్ల అవకాశాలు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. విద్యార్థులకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత అవసరం. ఆస్తి సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం.
సింహరాశి
సింహ రాశివారికి చంద్రబలం కలిసి వస్తుంది. నేడు సింహ రాశి వారు తీసుకుని కీలక నిర్ణయాలు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
కన్యారాశి
కన్య రాశివారికి నేడు అనుకూలంగా ఉంటుంది. పనుల్లో ఆలస్యం జరిగినా చివరికి అనుకూల ఫలితాలు వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్లాలి.
తులారాశి
తుల రాశివారికి నేడు ప్రయాణ యోగం ఉంది. వ్యాపారాల్లో లాభ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు గురించి వృశ్చిక రాశి వారికి ఆలోచనలు వస్తాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి శుక్ర ప్రభావంతో ఆనందకర వాతావరణం ఉంటుంది. ప్రేమ, కుటుంబ జీవితం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూల రోజు.
మకర రాశి
మకర రాశివారికి సూర్య, బుధ ప్రభావంతో పనుల్లో స్పష్టత పెరుగుతుంది. అధికారులతో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.
కుంభరాశి
కుంభ రాశివారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. నేడు వీరికి స్నేహితుల సహకారం అవసరం.
మీన రాశి
మీన రాశి వారికి శని, రాహువు ప్రభావం వల్ల ఓర్పు అవసరం. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు అందుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
ఏప్రిల్ నెలలో మిథున రాశి, కర్కాటక రాశి జాతక ఫలం -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
వాస్తు ప్రకారం మీరున్న ఇంటిని బావిని పూడ్చి కట్టారని తెలిస్తే? -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
today rashiphalau: ఉగాదికి ముందు సూర్య, శని,రాహువుల దయతో వీరికి పట్టిందల్లా బంగారం! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే!












Click it and Unblock the Notifications